NewsOrbit
Telugu TV Serials

Karthika Deepam November 18 today episode : మోనిత పైశాచికత్వం… సౌందర్యను రాడ్ తో కొట్టేసిందిగా..!

Karthikadeepam serial today episode review November 18 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1513వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 18న ప్రసారం కానున్న Karthika Deepam serial,1513వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1513వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది..గత ఎపిసోడ్ లో సౌర్యను సౌందర్య చూడడంతో సీరియల్ ఈరోజు మరింత ఆసక్తిగా మారిందనే చెప్పాలి.

Karthika Deepam

సౌర్యను తనతో తీసుకువెళ్ళనున్న సౌందర్య:

ఇక ఈరోజు ఎపిసోడ్ లో శౌర్య ని ఇంటికి వెళ్దాం రమ్మంటుంది సౌందర్య. ఇప్పుడు రాను, సంక్రాంతికి వస్తాను అని చెప్తుంది శౌర్య. ఇప్పుడు నువ్వు చిన్న పిల్లవి కాదు ఎక్కడపడితే అక్కడ ఉండిపోవటానికి అని సౌర్యను మందలించి నాకు చిన్న పని ఉంది చూసుకొని వస్తాను ఆ లోపు రెడీ అయి ఉండు అని అంటుంది. అలాగే ఇంద్రుడు, చంద్రమ్మలకు మా అమ్మాయిని ఇన్నాళ్లు పెంచినందుకు మీకు థాంక్స్ అంటుంది.మీకు ఏ అవసరం ఉన్న మా సహాయం ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతుంది.అయితే సౌందర్యను తీసుకుచ్చిన ఆ ఇల్లు ఇంద్రుడిది కాదు. వేరే వాళ్ళ ఇల్లు తమదిగా చూపించి సౌందర్యని మోసం చేస్తారు.ఇక ఏడుస్తున్న శౌర్యని మీ నానమ్మ వచ్చేలోగా మనం వెళ్ళిపోదాం అంటుంది చంద్రమ్మ.

Karthika Deepam

దీప కంగారు :

సీన్ కట్ చేస్తే ఇంటి తాళాలు లేక బయట తిరుగుతూ ఉంటుంది మోనిత. లోపల దీప కోపంతో రగిలిపోతూ ఉంటుంది నా ఇంటి తాళం బద్దలుకొట్టి వచ్చింది కదా, ఇప్పుడు తన ఇంటి తాళాలు బద్దలు కొట్టుకొని వస్తుంది. అప్పుడు చెప్తాను దాని పని అంటుకుంటుంది.డాక్టర్ బాబు ఈరోజు నేను మోనిత ని ఏమన్నా మీరు ఏం మాట్లాడకూడదు అని అంటుంది. సరే ఏం చేస్తావో నేను చూస్తాను అంటాడు కార్తీక్. తన భార్యని ఏదైనా చేస్తాను అంటే ఒప్పేసుకున్నాడు. అంటే డాక్టర్ బాబుకి నిజంగానే గతం గుర్తుకు వచ్చిందా అని అనుమానం పడుతుంది దీప.

Karthika Deepam

మోనిత దగ్గరకు వచ్చిన సౌందర్య:

ఇక కంగారుగా ఇంటి బయట తిరుగుతున్న మోనిత దగ్గరికి సౌందర్య వస్తుంది. దాంతో మరింత టెన్షన్ పడిపోతుంది మోనిత.మీకోసమే చూస్తున్నాను అని మోనిత అంటే నన్ను వదిలేసి వచ్చేసింది కాక నాకోసం వెయిట్ చేస్తున్నానంటావా అంటుంది సౌందర్య. ఇంట్లోకి వెళ్దాం పదమంటుంది సౌందర్య. తాళాలు లేవు అంటుంది మోనిత. సరే అయితే నాతో పాటు హోటల్ కి రా నాకు ఒక్కదానికే బోర్ కొడుతుంది అంటుంది సౌందర్య. మళ్ళీ కార్ కీస్ లేవు ఆంటీ అంటుంది మోనిత.

IMG 20221118 WA0063

మోనతను కొట్టిన సౌందర్య:

ఏంటే ఏమి అడిగినా లేవు అంటున్నవ్ అంటూ మోనిత చెంప పగలకొడుతుంది సౌందర్య. అయినా ఎందుకు అంత కంగారు పడిపోతున్నావ్ నా దగ్గర ఏదో దాస్తున్నావు అని ఆమె ఇంటి వైపు వెళ్తుంది. తాళం వేసి ఉండటంతో తాళాన్ని బద్దలు కొట్టడానికి ట్రై చేస్తుంది. ఇంటి బయట రాడ్ సౌండ్ విన్న దీప ఆ మోనిత ఇంటి తాళాలు బద్దలు కొడుతున్నట్టు ఉంది డాక్టర్ బాబు అంటుంది.ముందు ఇంట్లో ఏముందిలే బద్దలు కొట్టుకోని అనుకున్న మోనిత, సడన్ ఇంట్లో ఉన్న కార్తీక్ వాళ్ళని చూసేసరికి కంగారు పడిపోయి వెనక నుంచి రాడ్ తో సౌందర్య తల మీద కొడుతుంది. వెంటనే సౌందర్య స్పృహ తప్పి పడిపోతుంది.

IMG 20221118 WA0059

సౌర్యను ఓదార్చుతున్న చంద్రమ్మ :

సీన్ కట్ చేస్తే గుమ్మంలో ఏడుస్తూ కూర్చున్న సౌర్యని ఓదారుస్తుంది చంద్రమ్మ. మీ నానమ్మ వచ్చేసరికి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం లే బాధపడకు అంటుంది. ఇక్కడే ఉంటే నిన్ను తీసుకెళ్లి పోతారు అంటుంది చంద్రమ్మ. లేదు నేను చెప్తాను పండక్కి వస్తానని అప్పుడు మీరు కూడా నాతో వద్దురుగాని, పండగ అయిపోయాక మళ్ళీ వచ్చేద్దాం అంటుంది శౌర్య. అక్కడికి వెళ్తే మళ్లీ రావడం అంటూ ఉండదు దేవుడా నా బిడ్డని దూరం చేస్తున్నావా అని కంగారు పడిపోతుంది చంద్రమ్మ.

IMG 20221118 WA0060

సౌందర్యను కొట్టిన మోనిత :

ఇక లోపల ఉన్న దీప రాడ్ సౌండ్ వినిపించక పోయేసరికి ఏంటి డాక్టర్ బాబు తలుపు విరగ కొట్టడం మానేసింది, బయట ఏదో జరిగింది అంటుంది దీప. తాళం వచ్చేసినట్టుంది దీప అంటాడు కార్తీక్.నిన్న వార్నింగ్ ఇచ్చినట్టు తను మమ్మల్ని చంపడానికి ఏమైనా ప్లాన్ వేస్తుందా? ఇప్పుడు తన దృష్టిలో నేనైనా,డాక్టర్ బాబు అయినా ఒకటే. మమ్మల్ని విడదీయడానికి ఏమైనా చేస్తుంది. అని కంగారుపడుతుంది దీప.డాక్టర్ బాబు ఇక్కడ ఉండొద్దు ముందు బయటకు వెళ్ళిపోదాం అని కార్తీక్ ను తీసుకెళ్లిపోతుంది. స్పృహ తప్పిపోయిన సౌందర్యని కారులో తీసుకు వెళ్ళమని శివకు చెబుతుంది మోనిత.. అసలు ఈవిడ ఎవరు, ఎందుకు మేడం ఇవన్నీ రాడ్ తో కొట్టారు, మళ్లీ ఆవిడే కట్టు కట్టారు. ఏంటో ఈ మేడం ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు అనుకుంటూ హైదరాబాదు శివారు వైపు తీసుకుని వెళ్తుంటాడు.నేను గాని పోలీసులకు దొరికానంటే నా పని అయిపోతుంది అని చిరాకు పడుతుంటాడు శివ.

IMG 20221118 WA0065

మోనితను నిలదీసిన కార్తీక్ :

బయటికి వచ్చిన దీప వాళ్ళకి అక్కడ మోనిత కనిపించదు. రక్తపు మరకలు కనిపిస్తాయి. మోనిత కి ఏమైనా అయిందేమో అంటాడు కార్తీక్.మనల్ని కాపాడడానికి ఎవరైనా వస్తే వాళ్లను కొట్టిందేమో అంటుంది దీప.అప్పుడే అక్కడికి వచ్చిన మోనితని ఈ రక్తం ఏంటి అని అడుగుతుంది దీప. నీకేమైనా అయిందా అంటాడు కార్తీక్. నాకు ఏమీ కాలేదు అంటుంది మోనిత.అయితే కచ్చితంగా మోనిత ఎవరినో కొట్టింది డాక్టర్ బాబు అంటుంది దీప. నేనెందుకు ఎవరినో కొడతాను మీ ఇద్దరినీ లోపల చూసి ఏం చేయలేక బయటికి వెళ్లిపోయాను అంటుంది. ఇంతలో దీప మధ్యలో కలగచెసుకుని మోనితతో గొడవ పడుతుంటే ఇప్పుడు గొడవలు పెట్టుకోవద్దు అంటాడు కార్తీక్. తనని ఏమి అన్నా మీరు కలగజేసుకోనని మాట ఇచ్చారు. అయినా ఇది ఏదో చేసింది డాక్టర్ బాబు నాలుగు తగిలిస్తే నిజం చెప్తుంది అంటుంది దీప.గొడవలు వద్దు ఇంటికి వెళ్ళమంటే దీప వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది.ఇక మోనిత కూడా కోపంగా లోపలికి వెళ్ళగానే బయట ఉన్న రక్తపు మరకలు చూసి ఇక్కడ ఏదో జరిగిందని ఆలోచిస్తుంటాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri