Krishna Mukunda Murari: కృష్ణ మురారి ఇద్దరు రెడీ అయి కిందకి వస్తారు. పంతులుగారు వాళ్ళు రావడంతోనే కృష్ణ నీ మురారి కి బొట్టు పెట్టమని మురారిని కృష్ణకు బొట్టు పెట్టమని చెబుతారు. అలా ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటుండగా ముకుందా వారిద్దరిని చూసి కోపంతో రగిలిపోతుంది. ఇక ఇద్దరు కలిసి పూజ చేస్తారు.. సౌభాగ్యవ్రతం ముగిసిన తర్వాత పంతులుగారు మురారి కృష్ణను కలిసి ముకుందకు వాయినం ఇవ్వమని చెబుతారు..

ముకుందా దగ్గరికి మురారి వెళ్లి నా ప్రేమ నీతో స్వప్నం. ఆదర్శ్ తో నీ పెళ్లి నేటి జీవితం. ఇక నన్ను మర్చిపో అని మురారి ముకుంద కి స్ట్రైట్ గా వార్నింగ్ ఇస్తాడు. నువ్వు నన్ను ప్రేమించావు అన్న సంగతి కృష్ణకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని కూడా అంటాడు. ఆదర్శ్ వచ్చినా కూడా నా జీవితంలో సంతోషం లేకపోతే అని ముకుందా ప్రశ్నిస్తుంది. ఆదర్శ్ తో నువ్వు కలిసి ఉంటేనే నీకు విలువ. అదే కనుక జరగకపోతే ఇప్పుడు నేను నీకు ఇచ్చే విలువ కూడా ఇంకా తగ్గిపోతుంది . ఆ విషయం గుర్తు పెట్టుకో అని మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మురారి దగ్గరికి కృష్ణ వచ్చి ముకుందా ఎవరినో ప్రేమిస్తుందని పెళ్లికి ముందే ఎవరినో ముకుందా ప్రేమించింది. అందుకే తన జీవితంలో ఆదర్శ్ లేకపోయినా తను ప్రశాంతంగా ఉండలేక పోతుంది. నాకు తన ప్రేమ విషయం తెలిసిపోయింది అని కృష్ణ అంటున్న మాటలకు మురారి షాక్ అవుతాడు. నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. నేను సైకాలజీ స్టూడెంట్ ని నాకు అన్నీ తెలుసు అని కృష్ణ అంటుంది. ఇప్పటికీ ఎలాగోలా గండం నుంచి గట్టు ఎక్కుతాడు మురారి.

ఆదర్శ తిరిగి రావడం గురించి ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటుండగా .. కృష్ణ మురారి కూడా అక్కడికి వస్తారు . అప్పుడే కృష్ణ ఆదర్శిని వెతికి ఈ ఇంటికి తీసుకువచ్చే బాధ్యత నీదేనని.. వెతికి తీసుకువచ్చి ముకుందకు అప్పగిస్తానని దానికి మాట ఇవ్వండి అని కృష్ణ అంటుంది. మురారి ముకుందతో ఆదర్శ్ ని వెతికి తీసుకువచ్చే బాధ్యత నాది అని అంటాడు. భవాని కూడా ఆ విషయంలో మురారి ని సపోర్ట్ చేస్తుంది. నాకు తెలుసు మురారి ఆదర్శ్ ని నువ్వే వెతికి తీసుకురాగలవని తీసుకువస్తావని నాకు తెలుసు అంటూ అక్కడ నుంచి ముకుందా వెళ్ళిపోతుంది.

ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి మురారి అందరి ముందు ముకుందా ఎగ్జామ్ రిజల్ట్స్ చూసి తను డిస్టింక్షన్ లో పాస్ అయిందని వాళ్ళ అమ్మతో చెబుతాడు అప్పుడే ముకుందా? పెద్ద అత్తయ్యతో మాట్లాడి హౌస్ సర్జన్ గా ముంబై బెంగళూరులో జాయిన్ అయితే బెటర్ అని సలహా ఇస్తుంది లేదు అలాంటివి జరగదు ఏంటి కోడలు బయటికి వెళ్లి ఉద్యోగం చేయడానికి కుదరదు అని రేవతి కరకండిగా చెప్పేస్తుంది.