Categories: Telugu TV Serials

బావ నువ్వంటే ఇష్టం…అని సౌర్య అంటే తనని పెళ్లి చేసుకుంటా అంటున్న నిరూపమ్..!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్ లో పసుపు తాడు తీసుకుని వచ్చి హిమ మెడలో కట్టమని సౌర్య అనడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు.ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్, హిమకు పెళ్లి విషయంలో పూర్తిగా క్లారిటీ ఇచ్చి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు.

హిమకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన నిరూపమ్ :

ఈ క్రమంలోనే సౌందర్య, హిమపై సీరియస్ అవుతుంది. అప్పుడు ఆనంద్ రావు కూడా అవునమ్మా నీ జీవితంలో దేవుడు నీకు కావాల్సింది ఇచ్చినప్పుడు ఎందుకు చేజేతులా వదిలేసుకుంటున్నావు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు.అప్పుడు నిరుపమ్ నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తాను హిమ అని చెప్పి తన ముందు ఒక ప్రపోజల్ పెడతాడు. నువ్వు ఇప్పటికిప్పుడు సౌర్యను పెళ్లికి ఒప్పించు తన మెళ్ళో ఇప్పటికిప్పుడే తాళి కట్టేస్తాను అని అంటాడు నిరుపమ్. నాకు నిరుపమ్ బావ అంటే ఇష్టం నిరుపమ్ బావను పెళ్లి చేసుకుంటాను అని సౌర్యతో అనిపించు అంటాడు.ఇదే నీకు లాస్ట్ అవకాశం అని అంటాడు. హిమ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ప్రేమ్, హిమల ప్లాన్ ఏంటి..?

మరొకవైపు ప్రేమ్ మాత్రం హిమ కోసం ఎదురుచూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి హిమ వస్తుంది.అప్పుడు హిమ టెన్షన్ పడుతుండగా ఏమైంది చెప్పు అనడంతో హిమ జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు ప్రేమ్, ఐస్ క్రీమ్ తిందాంరా అని అనగా నాకు ఐస్ క్రీమ్ తినే మూడు లేదు బావ అని అంటుంది.ఆ తర్వాత నిరుపమ్ కోసం స్వప్న వెతుకుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి శోభ లగేజ్ తీసుకొని వచ్చేస్తుంది. ఇంతలోనే అక్కడికి నిరుపమ్ వస్తాడు.ఏంటి శోభ అంటే ఏదో కారణం చెప్తుంది.

హిమ దగ్గర ఎమోషనల్ అయిన సౌర్య:

ఆ తరువాత సౌర్య జరిగిన అన్ని విషయాలు తలచుకుని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి  హిమ రావడంతో అప్పుడు సౌర్య ఒక్కసారిగా ఎందుకు హిమ చిన్నప్పటి నుంచి నేను అంటే నీకు అంత కోపం. నువ్వేమో దర్జాగా పెరిగావు నేను అమ్మ వాళ్ళ దగ్గర ఎన్నో కష్టాలను అనుభవించాను తీరా కలిసి పోయాము అనుకునేసరికి అమ్మ నాన్న లను దూరం చేశావు అంటూ పాపం ఎమోషనల్ గా మాట్లాడుతుంది సౌర్య.అప్పుడు హిమ ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించిన సౌర్య మాత్రం అసలు పట్టించుకోదు.నీ మీద నాకు ద్వేషం ఎందుకు ఉంటుంది అని హిమ అనగా శౌర్య మాత్రం ఆపవే నీ డ్రామాలు అని హిమ పై కోప్పడుతుంది.

సౌందర్య వాళ్ళ ఇంటికి వచ్చిన నిరూపమ్ :

ఆ తర్వాత సౌందర్య, సౌర్య ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు సౌందర్య నీకు ఏం కావాలో చెప్పు అని అనగా వెంటనే సౌర్య ఇంట్లో జరుగుతున్న నాటకాలను ఎలా అయినా ఆపేయ్ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి నిరుపమ్ లగేజ్ తీసుకొని ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు సౌర్య,సౌందర్య ఇద్దరు షాక్ అవుతారు. నిరుపమ్ మాత్రం అమ్మమ్మ కొద్దిరోజులు నేను ఇక్కడే ఉంటాను అని అనగా వెంటనే సౌర్య చెప్పాను కదా నానమ్మ నాటకాలు జరుగుతున్నాయని అందులో ఇది కూడా ఒకటి అని అంటుంది.

నిరూపమ్ చేసిన పనికి షాక్ లో ప్రేమ్ :

అప్పుడు స్వప్న, శోభల ప్లాన్ గురించి మొత్తం జరిగిందంతా వివరిస్తాడు నిరుపమ్.తరువాత సౌర్య అక్కడనుండి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ప్రేమ్,హిమ అన్న మాటలు తలుచుకొని మురిసిపోతూ ఉంటాడు. ఇంతలోనే హిమ, ప్రేమ్ కీ ఫోన్ చేసి నిరుపమ్ వాళ్ళ ఇంటికి వచ్చిన విషయం చెప్పడంతో ప్రేమ్ షాక్ అవుతాడు.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

52 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

55 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago