బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1437వ ఎపిసోడ్ లో ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం కానున్న ఆగష్టు 23 వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం… ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తోంది. చిక్ మంగుళూర్‌లో దీప కార్తీక్‌ని వెతికే క్రమంలో అనుకోకుండా కార్తీక్‌ని చూస్తుంది కానీ కార్తీక్ దీపని గుర్తుపట్టడు. పైగా కార్తీక్‌తో ఉన్న శివ అంతా తెలిసే నాటకం ఆడుతున్నాడని దీపకు అర్థమైపోయింది.ఈ క్రమంలోనే ఈరోజు ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి.ఇక మరుసటి రోజు ఉదయం కార్తీక్ నిద్రలేవకుండా పడుకునే ఉంటాడు. శివ వెళ్లి సార్ లేవండి అని తట్టిలేపుతాడు.కార్తీక్ శివ మీద కాసేపు అరిచి నన్ను కదిలించకుండా వెళ్లు నేను లేవను పోవయ్యా’ అంటాడు కార్తీక్
దీప పెళ్లిరోజు వేడుకలు :
మరోవైపు దీప ఉంటున్న డాక్టర్ ఇంట్లో దీప పెళ్లిరోజు సెలబ్రేషన్స్ మొదలవుతాయి. దీప, కార్తీక్‌ల ఫొటో తయారు చేయించి గోడకు తగిలించి బెలున్స్లో అంతా అలంకరించి కేక్ తెచ్చి పెడతారు డాక్టర్, డాక్టర్ తల్లి, రామ్, బంటులు. ‘డాక్టర్ బాబు రావాలి.. డాక్టర్ బాబు రావాలి’ అని నినాదాలు చేస్తూ దీపని కేక్ కట్ చేయడానికి ఆహ్వానిస్తారు. ఇక దీప అంతా చూసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి ఎమోషనల్ అవుతుంది.
హిమ చెంప పగలకొట్టిన సౌందర్య:
ఇక సౌందర్య మాత్రం సౌర్య గురించి ఆలోచిస్తుంటే ఆనందరావు వచ్చి హిమ ఎక్కడా అంటాడు. అటు నుంచి హిమ ఆవేశంగా వచ్చి నాన్నమ్మ మనం సౌర్య దగ్గరకు వెళ్తున్నామా లేదా? వెళ్లకపోతే నేను ఏం తినను తాగను.నేను కూడా సౌర్యలానే ఇంట్లోంచి పారిపోతాను అంటుంది. వెంటనే సౌందర్య లాగిపెట్టి హిమను కొడుతుంది.నువ్వు కూడా పారిపోతే మేము ఎవరికోసం బతకాలి? అసలు ఏం అనుకుంటున్నావ్ నువ్వు’ అంటూ హిమ మీద అరుస్తుంది. దాంతో హిమ ఎమోషనల్ అవుతుంది.దాంతో ఆనందరావు మనం సౌర్య దగ్గరకు వెళ్దాం’ అని హిమని కూల్ చేస్తాడు. థాంక్యూ తాతయ్యా అంటూ లోపలికి పరుగుతీస్తుంది.
కార్తీక్ కోసం దీప వెతుకులాట :
ఇక దీప మాత్రం మళ్ళీ కార్తీక్ పర్స్ తీసుకుని కార్తీక్ తనని గుర్తు పట్టని సన్నవేశాన్ని గుర్తు చేసుకుని ‘మిమ్మల్ని ఎలాగైనా వెతికి పట్టుకుంటాను. అలాగే మీతో పాటు ఉన్న వాడి సంగతి కూడా తేలుస్తాను అనుకుంటూ కిందకు దిగుతుంది. డాక్టర్ తల్లికి ‘కార్తీక్‌ని వెతకడానికి వెళ్తున్నా’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది. ఇక ఆ పెద్దావిడ దీపను నీకు అంతా మంచే జరుగుతుందని ఆశీర్వదిస్తుంది.
అమ్మా నాన్న బతికే ఉన్నారని నమ్ముతున్న సౌర్య:
ఇక సౌర్య మాత్రం తల్లి తండ్రుల గురించి ఆలోచిస్తూ ఇంద్రుడు చంద్రమ్మలకు తన తల్లిదండ్రులు బతికే ఉన్నారని చెబుతుంది.చనిపోతే ఆసుపత్రిలో డెడ్ బాడీస్ దొరకాలి కదా? అలా దొరకలేదంటే వాళ్లు ఇక్కడే ఈ ఊరిలోనే ఎక్కడో ఉన్నారని అంటుంది సౌర్య.దాంతో ఇంద్రుడు.. ‘సరే అమ్మా మనం కూడా వెతుకుదాం అని నీకు ఆటో ఇష్టం అన్నావ్ కదా ఈ రోజు నుంచి ఆటో కిరాయికి తీసుకుని ఆటో నడుపుతాను అదే ఆటోలో మనం మీ అమ్మనాన్నలని వెతుకుదాం..’ అంటూ ధైర్యాన్ని ఇస్తాడు.ఇక రేపటి ప్రోమో అదిరిపోయింది అనే చెప్పాలి. దీపకు మోనిత కనిపిస్తుంది.. ట్విస్ట్ ఏంటంటే మోనిత కూడా కార్తీక్ ఫోటో పట్టుకుని వెతుకుతూ ఉంటుంది. దీప మోనితను చూసి కార్తీక్ ఎక్కడ అని అడిగితే నాకేమి తెలుసు నేను. కార్తీక్ కోసం పిచ్చి దానిలా వెతుకుతూనే ఉన్నాను అని అనడంతో మరి కార్తీక్ ను ఎవరు తీసుకుని వెళ్లినట్లు అని దీప అయోమయంలో పడుతుంది.