టాప్ స్టోరీస్

సముద్రం అట్టడుగునా ప్లాస్టిక్!

Share

సముద్రగర్భంలోకి ఈదుకుంటూ వెళ్తే అక్కడ ఏం కనపడుతుంది.. అందమైన చేపలు, మంచి మంచి నీటిమొక్కలు.. ఇవన్నీ అనుకుంటున్నారా? కాదు.. మనం వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్ధాలు. పసిఫిక్ సముద్రంలో 35,853 అడుగుల లోతు వరకు వెళ్లిన టెక్సాస్ పెట్టుబడిదారుడు, పరిశోధకుడు విక్టర్ వెస్కోవోకు అక్కడ ప్లాస్టిక్ వస్తువులు కనిపించాయి. ఈ నెల ప్రారంభంలో ఆయన నాలుగు గంటల పాటు తన బృందంతో కలిసి సముద్ర గర్భంలోకి వెళ్లారు. డీఎస్ వీ లిమిటింగ్ ఫాక్టర్ అనే జలాంతర్గామిలో కొంత లోతు వరకు వెళ్లి అక్కడి నుంచి బాగా కిందకు వెళ్లారు. సముద్రం అట్టడుగున ప్లాస్టిక్ వస్తువులు, కొన్ని లోహపు వస్తువులు ఉన్నాయని.. వాటితో పాటు ఇప్పటివరకు ఎవరూ గుర్తించని కొన్ని సముద్ర జీవ జాతులను కూడా కనిపెట్టానని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు.

‘‘సముద్రంలో అంత అట్టడుగు ప్రాంతంలో కూడా మానవులు సృష్టిస్తున్న కాలుష్యం చేరుకోవడం అత్యంత నిరాశాజనకంగా ఉంది’’ అని వెస్కోవో రాయిటర్స్ వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సముద్రాలలో దాదాపు 10 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి అంచనా. గడిచిన మూడు వారాల్లో జీవ, రాతి నమూనాలు సేకరించేందుకు మరియానా ట్రెంచ్ ప్రాంతంలో వెస్కోవో బృందం నాలుగు సార్లు డైవింగ్ చేసింది.


Share

Related posts

కేటీఆర్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నేడు

Siva Prasad

‘ఆంగ్ల మాధ్యమం పుస్తకాలు ప్రింట్ చేయోద్దు’

somaraju sharma

Leave a Comment