బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్తులు

హిందూపురం: సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్తులు ఆయనను అడ్డుకున్నారు. లేపాక్షి – హిందూపురం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. టీడీపీ అధికార ప్రతినిధి రమేశ్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు బాలయ్య హిందూపురంకు వచ్చారు. బాలయ్య వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. గలిబిపల్లికి రోడ్డు వేసేందుకు భూమి పూజ చేసి ఏడాది కావస్తున్నా ఇంకా పనులు పూర్తికాలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన బాలయ్య… అధికారులతో మాట్లాడి పనులను త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో, గ్రామస్తులు గ్రామస్థులు శాంతించారు.