ఇండోనేషియాలో వాల్కనో సునామీ

ఇండోనేసియాలోని దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని సముద్ర తీరంలో సునామీ రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. సముద్రగర్భంలో బద్దలైన అగ్నిపర్వతం కారణంగా వాల్కనో సునామీ సంభవించింది. సునామీ కారణంగా బీచ్ వద్ద ఉన్న పలు హోటళ్లు ధ్వంసమయ్యాయి. పలు భవనాలు, వందలాది ఇళ్లు దెబ్బ తిన్నాయి.

క్రకటోవా అగ్నిపర్వతం పేలడంతో సముద్ర గర్భంలో కొండచరియలు విరిగిపడటంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడటమే సునామీకి కారణంగా చెబుతున్నారు. సునామీ కారణంగా ఇంతదాకా అందిన సమాచారం మేరకు 222 మంది మరణించగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.