NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పవన్ ని కెలికి తిట్టించుకున్న టీవి 9..!!

 

తెలుగు మీడియాలో విలువలు ఏంతగా దిగజారాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వెబ్ మీడియా అనే తేేడా లేకుండా విలువలన్నీ బజారున పడుతున్నాయి. మెరుగైన సమాజం కోసం మేము పుట్టాము అంటూ సమాజాన్ని ఉద్దరించడానికి మేము ఉన్నాం అంటూ గొప్పలు చెప్పుకునే టీవీ 9 విలువల విషయంలో నడిరోడ్డుమీద ఉంటోంది. టివి 9 ని తిట్టని వారు అంటూ ఉండరు. అటువంటి టివీ 9 తాజాగా చేసిన ఒక ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ కు విపరీతంగా కోపం తెప్పించింది. దీంతో ఆయన ఘాటుగా టీవి 9కి లేఖ రాసేంత వరకూ వెళ్లారు. చివరకు టీవి 9 పది మెట్లు దిగి పవన్ కు క్షమాపణ చెప్పే స్థాయికి వచ్చింది. అసలు టీవి 9 ఏమి చేసింది. పవన్ కళ్యాణ్ అంత ఘాటుగా ఎందుకు రియాక్ట్ అయ్యారు, చివరకు టివీ 9 ఎందుకు క్షమాపణ చెప్పుకుంది అనే విషయాలు అన్నీ పరిశీలిస్తే..

pawan kalyan

పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 2వ తేదీన ఒక మంచి సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 621 ఆక్సిజన్ సిలెండర్ లను ఆసుపత్రులకు వితరణగా అందించారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు తమ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ప్రతిగా పవన్ కళ్యణ్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పిన వారికి, మీడియా వారికి, ప్రత్యేకంగా వెబ్ మీడియా నిర్వహకులకు ఇలా పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై సినీ నటి మాధవీలత స్పందిస్తూ తన ఫేస్ బుక్ పేజీలో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. పవన్ కళ్యాణ్ ఆ రకంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పడం పెద్ద తప్పు అన్నట్లుగా ఆమే పేర్కొన్నారు. మాధవీలత చేసిన పోస్టుపై టీవిీ 9 ఆమెను లైవ్ లోకి తీసుకుని ఎపిసోడ్ నడిపింది.

టీవీ 9 నడిపిన ఎపిసోడ్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. జనసేన పార్టీ కార్యాలయం నుండి టీవీ 9ను ఘాటుగా ఒక లేఖ రాశారు. కృతజ్ఞతలకు కూడా వక్రభాష్యం చెప్పడం భావ్యం కాదు. దేశ సమైక్యతకు వ్యతిరేకంగా, ప్రాంతీయ బేధ భావాలను రెచ్చగొట్టేలా టీవీ 9 ప్రసారం చేసింది. వేర్పాటు వాద ధోరణితో కూడిన సోషల్ మీడియా పోస్టును మీరు ప్రసారం చేయడం కరెక్టు కాదు అంటూ ఘాటైన పదజాలంతో లేఖలో జనసేన పేర్కొన్నది. జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకరరావు ఈ లేఖను టీవీ 9కు రాశారు. దీనిపై కంగారుపడిన టీవి 9 వెంటనే సంజాయిషీ ఇచ్చుకున్నది. తమకు అలాంటి ఉద్దేశం లేదని, మీ పార్టీ ప్రతినిధితో కూడా తాము మాట్లాడమనీ, ఉద్దేశపూర్వకంగా జరగలేదని టీవి 9 పేర్కొన్నది.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !