క్లాస్‌ రూమ్‌లో దమ్ముకొట్టిన టీచర్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

క్లాస్ రూమ్‌లోనే పొగ తాగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించి సస్పెండ్ అయ్యాడో ఉపాధ్యాయుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ లో చోటుచేసుకుంది. ఓ ప్రైమరీ స్కూల్‌ టీచర్‌ ఏకంగా క్లాస్‌రూమ్‌లో పొగతాగాడు. దర్జాగా కుర్చీలో కూర్చొని స్టైల్‌గా బీడి తాగుతూ కెమెరాకి చిక్కాడు. క్లాస్ రూంలో విద్యార్థులు ఉన్నారన్న ఇంగితం మరిచి ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సదరు ఉపాధ్యాయుడి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్‌ తరగతి గదిలోనే బీడి తాగడంపై స్థానికులు మండిపడుతున్నారు. అతడిపై అనేకసార్లు ఫిర్యాదులు అందడంతో విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. వీడియో ద్వారా పొగతాగింది నిజమేనని అధికారులు నిర్థారించారు. ప్రైమరీ స్కూలు విద్యార్థుల ముందే.. క్లాస్‌రూంలో పొగతాగిన టీచర్‌ను సస్పెండ్ చేశారు. టీచర్లు క్లాస్‌ రూమ్‌లో ఇలా చేయడం క్షమించరాని విషయమని జిల్లా విద్యాశాఖ అధికారి అజయ్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయుల చర్య విద్యార్థులను ప్రభావితం చేస్తాయని, క్లాస్ రూమ్ లో ఇలా పొగతాగకూడదని చెప్పారు.