Acharya – LaaheLaahe: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆచార్య.. వెండితెరపై చిరు స్టెప్పులేస్తూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.. ఆచార్య సినిమా నుంచి విడుదల మొదటి పాట “లాహే లాహే” సాంగ్ లో అదిరిపోయే స్టెప్పులు వేసి అలరించారు చిరంజీవి.. ఇటీవల ఈ పాట 50 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.. తాజాగా “లాహే లాహే” పాట 60 మిలియన్ న్యూస్ ను సొంతం చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్..!! ఆచార్య విడుదల కాకముందే లాహే లాహే పాటతో రికార్డుల మోత మోగుతోంది..!!

రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాట కు మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ పాటను హారిక నారాయణ్, సాహితీ చాగంటి ఆలపించారు. ఈ చిత్రాన్ని మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్, కొణిదల ప్రొడక్షన్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ పాత్ర అలరించనున్నాడు. రామ్ చరణ్ , చిరంజీవి లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. టాలీవుడ్ రికార్డులకు మెగాస్టార్ పెట్టింది పేరు.. ఇప్పటికే విడుదలైన లాహే లాహే సాంగ్ యూట్యూబ్ షేక్ చేస్తోంది.. మరి ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.