NewsOrbit
ట్రెండింగ్

Rajanikanth: మొన్న దేవి నాగవల్లి ఇప్పుడు మరొకరు అదే ఛానల్ పై మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు..!!

Share

Rajanikanth: “అశోకవనంలో అర్జున కళ్యాణం” సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో విశ్వక్ సేన్ రోడ్డుపై చేసిన సూసైడ్ ఫ్రాంక్ వీడియో అనేక విమర్శలకు దారి తీయడం తెలిసిందే. ఈ వీడియో పై ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ దేవి నాగవల్లి వ్యవహరించిన తీరు మొన్నటి దాకా అనేక విమర్శలకు దారితీసింది. ఈ వీడియోపై ఛానల్ లో దేవి నాగవల్లి డిబేట్ నిర్వహిస్తున్న సమయంలో మధ్యలో విశ్వక్ సేన్ రావడం తెలిసిందే. అయితే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాదన ఎక్కువ అవుతున్న సమయంలో దేవి నాగవల్లి గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ విశ్వక్ సేన్ నీ విమర్శించి బయటికి పంపించేయడం..ఇదే సమయంలో విశ్వక్ సేన్ బూతు పదం వాడటంతో మొత్తం సీన్ పెద్ద గొడవకు దారి తీసింది. ఇదంతా లైవ్ లో జరగటంతో… సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటువంటి తరుణంలో దేవి నాగవల్లి.. విశ్వక్ సేన్ పై… పలుచోట్ల ఫిర్యాదులు చేయడం తెలిసిందే.

Avinash Gunda Alligations on anchor rajanikanth

అయితే ఈ వివాదానికి సంబంధించి దేవి నాగవల్లి పైనే బయట ఎక్కువగా విమర్శలు వచ్చాయి. విశ్వక్ సేన్ వాడిన  బూతు పదం అంతకు ముందు అదే స్టూడియోలో.. దేవి నాగవల్లి సమక్షంలోనే యాంకర్ అనసూయ మాట్లాడితే.. ఏమీ అనలేదు. దీంతో ఒక టీవీ న్యూస్ ఛానల్ కి వస్తే అందులో వర్క్ చేసే యాంకర్ వ్యక్తిగతంగా .. హీరోనీ లైవ్ లోనే విమర్శిస్తూ బయటికి పంపించేయడం.. పట్ల చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇదే రీతిలో అదే టీవీ న్యూస్ ఛానల్ కి చెందిన ఒక ప్రముఖ యాంకర్ రజినీకాంత్ పై ఆ సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి అవినాష్ గుండా సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలు చేశారు. తన అవినీతిని. చేతకాని తననాన్ని ప్రశ్నించినందుకు . రెండు సంవత్సరాల క్రితం రాజీనామా చేసిన నాపై. రజనీకాంత్ అక్రమ తప్పుడు కేసులు పెట్టించి.. నన్ను బెదిరిస్తున్నాడు.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇదే సమయంలో అప్పట్లో సదరు టీవీ న్యూస్ ఛానల్ నుండి బయటకు వచేసిన్న సమయంలో ఇచ్చిన సర్వీస్ సర్టిఫికెట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రలు వేసినట్లే…

వరుసగా సదరు న్యూస్ ఛానల్ కి చెందిన యాంకర్లు దేవి నాగవల్లి, ఇంకా రజనీకాంత్ వంటి ప్రముఖుల పై ఈ విధమైన వివాదాలు నెలకొనటంతో బయట జనాలు మండిపడుతున్నారు. పబ్లిక్ తరపున ప్రశ్నించాల్సిన సంస్థలను అడ్డం పెట్టుకొని.. అందులో పని చేస్తూనే.. సామాన్యులపై చలామణి అవడం దారుణమని నెటిజన్లు మండిపడుతున్నారు. సామాన్యుల తరఫున ప్రభుత్వాలను, వ్యవస్థలను ప్రశ్నించాల్సిన న్యూస్ రిపోర్టర్ లు వెరైటీగా సామాన్యుల పైనే తమ ప్రతాపం చూపించడం..ఆ వివాదాన్ని ఒక పెద్ద న్యూస్ గా క్రియేట్ చేసి ఛానల్ లో చూపించడం.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రలు వేసినట్లే.. అవుతుందని.. అన్యాయమని..తాజా పరిణామాలపై సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా న్యూస్ ఛానల్స్ వ్యక్తిగతంగా కొంతమంది సినిమా హీరోలను టార్గెట్ చేసుకుని.. సినిమా హిట్ అయినా గాని ఫ్లాప్ అని కథనాలు ప్రసారం చేయటం, హీరోలను డిబేట్ లలో అవమానించి స్టూడియో నుండి పంపించేయడం మంచి పరిణామం కాదని..అంటున్నారు. జనాలకు న్యూస్ ఛానల్స్ పై నమ్మకం పోయే ప్రమాదం ఉంటుందని తాజా పరిణామాలపై మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే అవినాష్ గుండా.. తన పోస్టులో రజినీకాంత్ అవినీతి అక్రమాలు ఏంటో అన్న దాని గురించి మాత్రం ప్రస్తావన తీసుకురాలేదు.


Share

Related posts

Sonusood : సోనూ సూద్ సహాయం చేయడం చూశారు , సోనూ సిక్స్ ప్యాక్ చూసారా ? ఇంటర్నెట్ ని వేడి పుట్టిస్తోన్న ఫోటో

bharani jella

Bigg Boss Telugu 5 : బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టీఆర్పీ రేటింగ్ పెరగటానికి సరికొత్త ప్లాన్..రంగంలోకి.. సొహైల్, అరియనా…??

sekhar

బిగ్ బాస్ 4 : అభిజిత్-అఖిల్ చేసిన పనికి ఏడ్చేసిన మోనాల్..! ఇద్దరి ముఖాలు వాచిపోయేలా వార్నింగ్ ఇచ్చేసింది

arun kanna