సత్యం సినిమాతో ఇండస్ట్రీలో మంచి ఫేం దక్కించుకున్న సూర్యకిరణ్ బిగ్ బాస్ నాలుగో సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడని అందరూ ఆశించారు. అయితే మొదటి వారంలోనే తిరిగి ఇంటికి సాగనంపారు. బయటికి వచ్చిన సూర్యకిరణ్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కిరణ్ సత్యం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించాడు. అయితే ఇండస్ట్రీలో నమ్మిన వారే నన్ను మోసం చేశారని చెప్పిన సూర్య కిరణ్ తన చేత ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టించి తనకు 10 కోట్ల చేకూర్చారు అని వాపోయాడు. అయితే ప్రస్తుతానికి అతని దగ్గర అరవై కథలు సిద్ధంగా ఉన్నాయి సూత్రధారి అనే సినిమాతో మళ్లీ కం బ్యాక్ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నాడు
. ఇక పోతే ఇదే వరుసలో సూర్య కిరణ్ బిగ్ బాస్ హౌస్ లో తన రెమ్యూనరేషన్ గురించి కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. హౌస్ లో అడుగు పెట్టి నందుకు ఎంతో సంతోషించాను అని. . షో నిర్వాహకులు కూడా తను అడిగిన దానికి కన్నా 10 రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఇచ్చినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంకా కరెక్ట్ గా ఎంత అమౌంట్ అతను ఈ షో ద్వారా పొందాడో చెప్పడానికి నిరాకరించిన కిరణ్ దగ్గరనుండి యాంకర్ తెలివిగా సమాధానం రాబట్టే ప్రయత్నం చేసింది. మీకు రెండు లక్షలు అనుకున్నా వారానికి ఐదు రోజుల్లో కనీసం పది లక్షలు అయినా వచ్చి ఉంటాయి కదా అని ఆమె అడిగిన ప్రశ్నకు కూడా తెలివిగా తప్పించుకున్నాడు. ఆ మొత్తాన్ని బయటికి వెల్లడించలేను ఆయన స్పష్టం చేశారు.
అయితే దాదాపు భారీ ఆర్థిక నష్టాన్ని మోసాలకు గురి అయ్యి కోల్పోయిన సూర్యకిరణ్ పరిస్థితిని చూసి ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. అతనిని కొద్దిరోజులు ఇంట్లో ఉంచి ఉంటే బాగుండేది అని సోషల్ మీడియాలో కామెంట్లు సెక్షన్ లో అనుకుంటున్నారు.