Police walk near Robb Elementary School following a shooting, Tuesday, May 24, 2022, in Uvalde, Texas. (AP Photo/Dario Lopez-Mills)
Texas Shooting: అమెరికా టెక్సాస్ నగరంలో ఓ ఎలిమెంటరీ స్కూల్ లో విద్యార్ధులపై 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ దారుణమైన సంఘటనలో 19 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు మరణించడం జరిగింది. ఏకంగా ఆగంతకుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి పాఠశాలలో చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఒక్కసారిగా పాఠశాలలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చే లోపే కాల్పులు జరపడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి సాల్వడార్ రామోస్ అనే వ్యక్తి అని పోలీసులు గుర్తించారు.
గతంలో ఓ హత్యానేరంలో ఇతడు అనుమానితుడిగా ఉన్నట్లు ఈ క్రమంలో అతనీ.. పోలీసులు పట్టుకునే క్రమంలో చేజింగ్ చేస్తుండగా అతడు తన ట్రాకు నుండి దిగి రాబ్ ఎలిమెంటరీ పాఠశాల లోకి ప్రవేశించి పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు అక్కడి గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలియజేశారు. మొత్తం 21 మంది పై కాల్పులు జరిపితే అందులో ఇద్దరు కొన ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అని స్పష్టం చేశారు. చనిపోయిన పిల్లల్లో ఎక్కువ మంది నాలుగు 4 నుండి 11 సంవత్సరాల వయస్సు ఉన్న వారే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు భారీగా చేరుకుని ఘటనకు పాల్పడిన సాల్వడార్ రామోస్ అనే వ్యక్తిని అక్కడికక్కడే కాల్చి చంపేశారు. జరిగిన ఈ దుర్ఘటన పట్ల అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హరిస్ స్పందించారు. ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రతి సారి మా గుండెలు బద్దలయ్యాయి అని చెప్పటం సహజం. కానీ ఇటీవల నిత్యం అమెరికాలో కాల్పులు జరుగుతూ ఉండటంతో అమెరికన్ల గుండెలు పదేపదే బద్దలై పోతున్నాయి. ఈ తరుణంలో ఇకనైనా ధైర్యం చేసుకుని వీటికి శాశ్వతంగా అడ్డుకట్ట వేసే దిశగా ఆలోచన చేయాలి అని కమల హరిస్ స్పష్టం చేశారు.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…