సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏ ఆహారం పడితే అది తినేస్తూ ఉంటున్నారు. అందువల్ల అనేక అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా.. ఆడవారికి గర్భసంచి ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడతాయి. నిపుణులు చేసిన పరిశోధనలో కొన్ని ఆహారాలు గర్భసంచిని దెబ్బతీస్తాయని కనుక్కున్నారు. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. స్వీట్స్:
స్వీట్స్ ఎక్కువగా తినడం ద్వారా గర్భసంచి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది అంటూ నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైనవి ఐస్ క్రీమ్, పాన్ కేక్, కుకీలు అసలు తినకూడదు.
2. ఆల్కహాల్:
ప్రస్తుత కాలంలో ఆడవారు కూడా ఆల్కహాల్ ని తాగడం అలవాటు చేసుకున్నారు. ఇందువల్ల గర్భసంచి దెబ్బతింటుంది అంటున్నారు నిపుణులు.
3. కెఫెన్:
కెఫెన్ కంటెంట్ ఎక్కువగా ఉండే టీ లేదా కాఫీలను దూరంగా ఉంచడం మంచిది. కెఫెన్ ఎక్కువగా తీసుకుంటే ఇంప్లాంటేషన్ ప్రక్రియ దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో గర్భాశయం పై ప్రభావం చూపిస్తుంది.
పైన చెప్పిన మూడు ఆహారాలను అస్సలు తినవద్దు. అలా తినడం ద్వారా మీ గర్భసంచి దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.