బిగ్ బాస్ 4 లో హాట్ టాపిక్ గా మారిన మోనాల్ గజ్జర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమెపై ఎన్నో రకాల ఆరోపణలు కూడా వస్తున్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ 4 నుంచి ఎటిమినేట్ అయిన కరాటే కళ్యాణి మోనాల్ గజ్జర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. స్కిన్ షో మేం చేయలేదు కబట్టి మేం ఎలిమినేట్ అయ్యాం అని ఆమె వాక్యానించారు. గ్లామర్ షో చేసే వాళ్లే ఈ షో లో కొనసాగుతారని నిండా కప్పుకుని ఉంటే తమ లాంటి వాళ్లను ఎలిమినేట్ చేస్తారని ఆరోపించారు. ఒక చానెల్ లో ఈమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయ్.
అయితే ఇంతవరకు ఎలిమినేట్ అయిన ఐదుగురు కంటెస్టెంట్ లందరిని కూడా కావాలనే పంపించారని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మోనాల్ గజ్జర్ పై నెటిజన్లు ఆమె తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఫ్యామిలీతో కలిసి ఇలాంటి షో చూడగలమా, మరీ ఇంత దారుణంగా బట్టలు దరిస్తారా అంటూ మండిపడుతున్నారు. ఎంత అందంగా కనిపించాలన్నా మరీ దాచుకోవాల్సిన శరీర భాగాలను ఇలా బయటకు చూపిస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యామిలీ ఆడియెన్స్.
అలాగే బిగ్ బాస్ షో నిర్వహించే గేమ్స్, ఇతర కార్యక్రమాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చకపోయినప్పటికీ ఆమెను షోలో ఇంకా ఉంచడంతో పాటు ఆమెను హైలెట్ చేయడంతో ప్రేక్షకుల్లో బిగ్ బాస్ షో పట్ల ఆదరణ తగ్గుతుందని చెప్పవచ్చు. కాగా ఈ బిగ్ బాస్ షో మొత్తం మోనాల్ పైనే నడుస్తోందని నెటిజెన్లు అభిప్రాయ పడుతున్నారు.
బిగ్ బాస్ 1 నుంచి 3 వరకూ ఎంతో మంది హాట్ బ్యూటీలు వచ్చినా ఇలాంటి ఎక్స్ పోజింగ్ ఇవ్వలేదంటూ ఆమెపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొదటి నుంచి ఆమె డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం మెరుగ్గానే ఉన్నా రాను రాను మితిమీరుతోందని, ఆమె వేర్ విధానంతో కెమెరాకు ఎక్కువ పని కల్పిస్తోందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఆమె ట్రయాంగిల్ మూలంగా ఈ షో పేరు చెడిపోతుందని కొందరు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆమె ఆట తీరును మారిస్తే మంచిదని లేకుంటే బిగ్ బాస్ షో చూడటం కష్టమేనని అంటున్నారు ఫ్యామిలీ ఆడియెన్స్.