ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీ వార్తలు ఎక్కువైపోయాయి. ఇంటర్నెట్ నిండా అవే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. బాలీవుడ్ బెబో కరీనా కపూర్ అప్పుడే రెండో బిడ్డకు జన్మనివ్వడం…. తాజాగా అనుష్క శర్మ సైతం విరాట్ కు తనకు తొలి సంతానం కలుగుతుందని ప్రకటించేసింది.
ఇక టీమిండియా కెప్టెన్ వారసుడి/వారసురాలి వార్తతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. అంతేకాకుండా భారత మేటీ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య భార్య ఇప్పటికే బిడ్డకు జన్మనిచ్చింది.వీరందరిలో అనుష్క శర్మకు పిల్లలు ఎప్పుడూ అన్న ప్రశ్న తరచు ఎదురవుతూనే ఉంది.
పెళ్లయి రెండేళ్లు అయినా కూడా వారికి సంతానం లేదని అభిమానులు చాలాకాలం ఆమెను అడుగుతూనే ఉన్నారు. అయితే పక్కా ప్లానింగ్ తో విరాట్ అనుష్క, విరాట్ సరైన సమయంలో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇక అన్నింటిలో అనుష్క శర్మ ను అనుసరిస్తుంది అని పేరున్న అక్కినేని కోడలు సమంత గర్భవతి అయ్యేది ఎప్పుడు అన్న ప్రశ్న కూడా సామ్ కు తరచుగా ఎదురవుతూనే ఉంది.2017 లో నాగచైతన్య-సమంత వివాహం చేసుకున్నప్పటి నుండి ఇదే తరహా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
తాజాగా ఇంస్టాగ్రామ్ లో సమంత సెషన్స్ లో 33 ఏళ్ల సమంతకు మరో సారి ఈ ప్రశ్న ఎదురు కావడంతో ఆమె కాస్త వ్యంగ్యంగానే స్పందించింది. తను పెళ్ళి చేసుకున్న నాడే.. అనగా 2017 లోనే గర్భవతిని అయ్యానని…. ఆ బిడ్డ బయటకు రావడానికి చాలా సమయం తీసుకుంటుంది అంటూ ప్రశ్న వేసిన అతనికి చాలా గట్టిగానే సమాధానం ఇచ్చింది. అయితే ఆమె కోపంగా అందో… లేక వ్యంగ్యంగా అందో తెలియదు కానీ…. ఆ సమాధానంతో ఇప్పటివరకు ఆమెను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినవారంతా సైలెంట్ అయిపోయారు.