తన గ్లామర్, నటనతో మెస్మరైజింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో … తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శృతి హాసన్ కాస్త బ్రేక్ తీసుకుని మళ్లీ రంగంలోకి దిగింది. ఈ మధ్య రేస్‌లో కాస్త వెనుకబడ్డా మళ్లీ గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇందుకోసం తనను తాను కొత్తగా మేకోవర్ చేసుకుంటూ..తెగ కసరత్తు చేస్తోంది. విలక్షణ నటుడు కమల్ హాసన్ తండ్రైనా…ఎక్కడా ఆయన ఇమేజ్.. బ్రాండ్ పడకుండా.. స్వసక్తితో సినీరంగంలో ఎదుగుతూ వచ్చింది శృతి. మొదట ప్లే బ్యాక్ సింగర్‌గా తమిళ ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించిన శృతి హాసన్ …ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.
తెలుగులో అమ్మడు చేసిన అనగనగ ఓ ధీరుడు, ఓమై ఫ్రెండ్, సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయాయి. దీంతో శృతి ది ఐరన్ లెగ్ అని వెటకారం చేశేవారు. అలా సినిరంగం ప్రవేశంలో కాస్త ఆటుపోట్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు. ఎలాగైనా పరిశ్రమలో రాణించాలనుకుంది…కష్టపడింది. 2012లో హరీష్ శంగర్ రూపొందించిన కమర్షియల్ సినిమా గబ్బర్‌సింగ్ సూపర్ డూపర్ హిట్‌తో శృతికి మంచి టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆ తరువాత బలుపు, ఎవడు వంటి సినిమాలు చేసి ప్రేక్షకుల మన్ననలను పొందింది.
ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో రేసు గుర్రంలో సినిమాలో నటించిన శృతి హాసన్ పెర్ఫార్మెంన్స్కి ఉత్తమ నటి అవార్డును కూడా దక్కించుకుంది. ఆ తరువాత చేసిన గబ్బర్‌సింగ్2, శ్రీమంతుడు సినిమాలు వరుస హిట్లు అందుకోవడంతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిపోయింది. తెలుగులో కాటమరాయుడు సినిమా తరువాత మరో సినిమా చేయలేదు శృతి. పర్సనల్ ఇష్యూస్ కారణంగా మూవీస్ కాస్త బ్రేక్ చెప్పింది. ఇలా మూడేళ్లు గడిపిన ఈ అమ్మడు మళ్లీ ఇండస్ట్రీని ఊపేసేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం తమిళ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది శృతి.
లాభం చిత్రంలో విజయ్ సేతుపతితో జత కట్టింది. ఇక తెలుగులో మాస్ మహారాజ సరసన యాక్షన్ ఎంటర్టైనర్ క్రాక్ తో రీఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం క్రాక్ సినిమా షూట్ గోవాలో జరుగుతోంది. అక్కడ షూటింగ్ సమయంలో బీచ్‌లో రెచ్చిపోయి తన అందాల విందుతో అందరినీ కనువిందు చేస్తోంది. ఈ మధ్య కాస్త సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న శృతి గోవా బీచ్‌లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. దీంతో సినిమా అవకాశాల కోసమే శృతి అందాలను ఆరబోస్తోందని నెటిజెన్స్ కామెంట్స్ చేసేస్తున్నారట. ఏదేమైనా టాలీవుడ్ లో శృతి హాసన్ మళ్ళీ బిజీ కాబోతోంది.