108 పై విచారణ చేయగలరా : విజయసాయిరెడ్డి

హైదరాబాద్, జనవరి 2: రాష్ర్టంలో 108 అంబులెన్స్ లు కొనుగోళ్ళ వ్యవహారంలో ఒకొక్కదానిపైన ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకున్నార అరోపణలపైన దర్యాప్తు చేయించగలరా అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యలు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

ఇటీవల తెలంగాణా ఆరోగ్యశాఖ మాజీ మంత్రి 108 అంబులెన్స్‌ల కోనుగోళ్ళలో ఐదులక్షల వంతున కమీషన్‌లు తీసుకున్నారన్న ఆరోపణలపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించాలని తన ట్విటర్‌లో కోరారు. దివంగత సీఎం డా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దేశంలోనే 108 అగ్రస్ధానంలో నిలిచిందనీ, ప్రస్తుతం 108 అంబులెన్స్‌లు మూలనపడ్డాయన్నారు.