(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోకు 20గంటల్లో 20లక్షల 73వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఇది ఏమంత ఆషామాఫీ విషయం కాదు. ఈ వీడియోను అన్ని లక్షల మంది చూసే విషయం ఏముందని భావిస్తున్నారా ? అందులో ప్రత్యేకం ఏమిటంటే టాలీవుడ్ క్యూట్ పెయిర్‌గా పేరుపొందిన అక్కినేని చైతన్య, సమంతలు ఒక పార్టీలో డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
స్పెయిన్ టూర్లో ఉన్న వీరిద్దరు శనివారం ఒక వేడుకలో పాల్గొన్నారు. చైతన్యతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘వి విల్ రాక్ యూ’ అంటూ సాగే పాటకు వీరిద్దరు డ్యాన్స్ చేస్తూ గొంతు కలిపారు.
https://www.instagram.com/p/B11K0WDh3pz/?utm_source=ig_web_copy_link