(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ట్రాఫిక్ జామ్ కాకుండా కొందరు ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయత్నాలు చేసి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. చండీగఢ్ కు చెందిన ట్రాఫిక్ పోలీస్ భూపిందర్ సింగ్ ట్రాఫిక్ నిబంధనలపై పాటల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. దలేర్ మెహంది పాట ‘బోలో తారా రారా’ పాట పాడుతూ ట్రాఫిక్ నిబంధనలపై భూపిందర్ సింగ్ అవగాహన కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
I am glad that my music is used by Traffic police to inspire people to follow rules.
Happiness Means Daler Mehndi
Celebration Means Daler Mehndi
Thank you for your love and Support#DalerMehndi #BoloTaRaRaRa @trafficchd @ssptfcchd pic.twitter.com/1fUZMmCNkt— Daler Mehndi (@dalermehndi) October 17, 2019
రహదారుల భద్రత, ప్రమాదాలు, వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు, ఆర్టీఏ అధికారులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా హెల్మెట్లు వాడకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ నేపథ్యంలోనే భూపిందర్ సింగ్ వాహనదారులకు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నాడు. ట్రాఫిక్ రూల్స్ పై పాట పాడుతూ రూల్స్ చెబుతున్నాడు. ఇటువంటి వినూత్న ప్రయోగాల వల్ల ప్రజలు ట్రాఫిక్ నిబంధనల గురించి శ్రద్ధగా విని నేర్చుకుంటున్నారని భూపిందర్ సింగ్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే మోటార్ వాహన చట్టం ప్రకారం భారీ జరిమానాలు కూడా కట్టాల్సి వస్తుందని ఆయన అవగాహన కల్పిస్తున్నారు.
This can only happen in India
and that too by a Punjabi cop.pic.twitter.com/7jdhZaakaO— Tarek Fatah (@TarekFatah) October 18, 2019
ప్రస్తుతం భూపిందర్ సింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆయన సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. గతంలోనూ ఆయన డ్రంకెన్ డ్రైవింగ్, రోడ్డు భద్రతా నియమాలపై ఇటువంటి పాటల ద్వారానే అవగాహన కల్పించారు.
https://www.facebook.com/ChandigarhTrafficPolice/videos/458430581418714/