ఇస్రో చైర్మన్ కె శివన్ ను ప్రధాని మోది ఒదార్చారు. చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపనున్న కొద్ది క్షణాల ముందు సంకేతాలు నిలిచిపోవడంతో శాస్త్రవేత్తలు నిరుత్సాహానికి లోనయ్యారు. ఈ సమయంలో ప్రధాని మోది శాస్త్రవేత్తల వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. ఇస్రో చైర్మన్ శివన్ ను మోది ఆలింగనం చేసుకొని ఓదార్చారు. అధైర్యపడవద్దు, భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధిస్తారు అంటూ ధైర్యం చెప్పారు.
#WATCH PM Narendra Modi hugged and consoled ISRO Chief K Sivan after he(Sivan) broke down. #Chandrayaan2 pic.twitter.com/bytNChtqNK
— ANI (@ANI) September 7, 2019