న్యూఢిల్లీ : ప్రముఖ నటీనటులు దీపిక పదుకొణె, రణ్బీర్ కపూర్ నటించిన ‘యే జవానీ హై దివానీ’ సినిమా రిలీజ్ అయి ఆరేళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఆ సినిమాలో నటించిన జంట రణ్బీర్, దీపికా అదిరిపోయే డ్యాన్స్ చేశారు. అదే సినిమాలోని ‘బాలమ్ పిచ్కారీ’ అనే పాటకు డ్యాన్స్ చేసి ఒక సారి ఆ సినిమాను గుర్తు తెచ్చుకున్నారు.
ఈ వీడియోను ముందుగా దీపిక తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తరువాత రణ్బీర్ కపూర్ ఫ్యాన్స్ ఆ వీడియోను రణ్బీర్ ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దీపిక ప్రస్తుతం ఛపాక్ సినిమాలో నటిస్తుండగా, రణ్బీర్ చివరి సినిమా సంజు. ప్రస్తుతం రణ్బీర్ చేతిలో బ్రహ్మస్త్ర, షామ్షెరా సినిమాలు ఉన్నాయి.
https://www.instagram.com/p/ByH_mAJhs9U/?utm_source=ig_web_options_share_sheet