NewsOrbit
బిగ్ స్టోరీ

చీమా చీమా ఎందుకు కుట్టావ్… పుట్టలో వేలు పెడితే కుట్టనా..?

 

ఇది రాజస్థాన్‎లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాలం కలిసొస్తే ఏదైనా సాధ్యమే… కాలం కలిసిరాకుంటే ఏదీ సాధ్యం కాదు… ఇదే ఇప్పుడు కాంగ్రెస్ దుస్థితి. ఏమో ఏపీ విభజన తర్వాత ఆ పార్టీ నేలమట్టమైపోతోంది.

 

 

వాస్తవానికి విభజనతో కొన్ని సీట్లనైనా రాబట్టుకుంటామని వేసిన పాచిక అట్టర్ ఫ్లాప్ అవగా… ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బిక్కిబిక్కుమంటోంది. 2014-2020 మధ్య ఆ పార్టీ ఎన్నో విషమ సంకటాలను ఎదుర్కొంది. మధ్యలో పుంజుకొంది. వాస్తవానికి శరీరంలో ఎక్కడైనా సమస్య ఉంటే… అందుకు తగిన విధంగా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఎవరైనా చేసే పనే. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇప్పుడు రోగం తెలిసింది. అందుకు మందు తెలిసింది. కానీ చికిత్స చేయడానికి తగిన సందర్భం కన్పించడం లేదు.

ముఖ్యమంత్రి పీఠం నుంచి గెహ్లాట్ ను తప్పించాలంటూ స్కెచ్ వేసిన సచిన్ పైలెట్ మొదట్లో కొంచెం బెరుగ్గా కన్పించినా ఇప్పుడు రోజు రోజుకు స్ట్రాంగ్ గా తయారవుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు అంత తేలిగ్గా తీసుకోదని చరిత్ర చెబుతున్న సత్యం. అయితే సచిన్ విషయంలో ఆ పార్టీ చేస్తున్న తప్పులన్నీ కూడా బీజేపీ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్‎మెంట్‎కు మార్గం సుగమమం చేస్తోంది. అవును సచిన్ పైలెట్ ను అడ్డుపెట్టుకొని రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కారును కూల్చేస్తోందంటూ హస్తం పార్టీ నేతలు బాగానే ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే తాను తీసుకున్న గోతిలో కాంగ్రెస్సే పడుతున్నట్టు కన్పిస్తోంది.
బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విలీనం కూడా ఇప్పుడు రివర్స్ గేర్‎లో ఆ పార్టీని ఇరుకునపెడుతోంది. అంతా బాగా ఉన్నప్పుడు ఎవరూ కూడా మాట్లాడరు. తేడా వస్తేనే స్టాండ్లు తీసుకుంటారు. ఇప్పుడు బీజేపీ గేమ్ మొదలవడంతో రంగంలోకి బెహన్‎జీ మాయవతి కూడా వచ్చేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో విలీనం చేసుకునే అంశంపై పోరాటానికి సిద్ధమని.. సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తానంటూ ఆమె చేస్తున్న హెచ్చరికలు కాంగ్రెస్ పార్టీకి చెమటలు పట్టిస్తున్నాయ్. అంటే మొత్తంగా ఆరుగురు ఎమ్మెల్యేలు దారిలోకి వస్తే ఓకే… లేకుంటే వారందరూ డిస్క్వాలిఫై అయిపోయినా అయ్యే పరిస్థితి క్రియేట్ చేయాలని మాయవతి వచ్చినట్టు కన్పిస్తున్నారు.

200 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో ఇప్పుడు గెహ్లాట్ బలం కేవలం 102 మాత్రమే. అంటే మెజార్టీకి ఒక ఎమ్మెల్యే మాత్రమే అదనంగా ఉన్నారు. ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విలనీనం కావడంతో ఆయనకు కొంత సానుకూలత లభిస్తుంది. ఇప్పటికే బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనం అంశం రాజస్థాన్ హైకోర్టులో ఉంది. సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెబుతానంటూ బెహన్‎జీ విసురుతున్న సవాల్ ఆ పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయ్.

వీలైనంత తొందరగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బలపరీక్షలో విజయం సాధించాలని చూస్తుంటే… గవర్నర్ నుంచి వస్తున్న కండిషన్స్… కాంగ్రెస్ పార్టీని కంగారుపెట్టేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు పెట్టాలంటూ గవర్నర్ ను కోరగా… అందుకు ఆయన ఇచ్చిన 21 రోజుల నోటీస్ ఇప్పుడు గెహ్లాట్ కు సంకట స్థితి తీసుకొస్తున్నాయ్. అసెంబ్లీ నిర్వహించడం ప్రభుత్వ హక్కు… గవర్నర్ అనుమానాలు నివృత్తి చేస్తామంటూ ఆ పార్టీ చెబుతున్నప్పటికీ… సంథింగ్ సంథింగ్ జరుగుతుందన్న ఫీలింగ్ కలిగిస్తోంది. బలపరీక్షకు ముందే కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న వ్యూహం రాజస్థాన్‎లో అమలవుతున్నట్టుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి మరో వారం పది రోజుల్లో గెహ్లాట్ మాజీ సీఎం అయ్యే ప్రమాదం స్పష్టంగా కన్పిస్తోంది.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju