NewsOrbit
న్యూస్

తిరుపతి ఉప ఎన్నిక :ఊపుమీదున్న వైసిపి!!

ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ అప్రమత్తమైంది.

ఇప్పటివరకు అటకెక్కిన అభివృద్ధి అంశాన్ని వైసీపీ ఇప్పుడు పట్టించుకుంటోంది.ఇంకా చెప్పాలంటే నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా అప్పుడు అధికారం లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంత హడావిడి చేసిందో అంతకు మించి వైసిపి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు చేయనున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి.వైసీపీ అధికారంలోకొచ్చాక ఈ పదిహేను నెలల కాలంలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇదే ఆవడం ,గెలుపు తప్పనిసరి కావడంతో ముఖ్యమంత్రి జగన్ కూడా ఏ ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదట.పక్కా ఏర్పాట్లతో ఉప ఎన్నికల బరిలో దిగి మొన్నటి ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ సాధించి టిడిపి ఇతర ప్రతిపక్షాలు నోళ్ళు మూయించటానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారట .నిజానికఇప్పటి వరకూ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు.

అభివృద్ధి కార్యక్రమాలను జగన్ పట్టించుకోలేదు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు పదిహేను నెలలుగా పడకేశాయనే చెప్పాలి.అయితే అనూహ్యంగా ఉప ఎన్నిక వస్తుండటం, విజయం తప్పనిసరి కావడంతో జగన్ అప్రమత్తమయ్యారు. తిరుపతి పార్లమెంటు నియోజకవవర్గం పరిధిలో ఉన్న సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నిధులు విడుదల కానున్నాయి. ఇప్పటి వరకూ ఆ నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ పనులపై సీఎంవో కార్యాలయం ఆరా తీస్తోంది.

మరి కొద్ది రోజుల్లోనే ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా నిధులను విడుదల చేయడానికి జగన్ సిద్ధమయ్యారు. నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న పనులను పంపాలని సీఎంవో కోరడంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఖుషీగా ఉన్నారు. అయితే అదే సమయంలో ఈ ఎమ్మెల్యేలకు మెజారిటీ టార్గెట్ ను కూడా జగన్ విధించనున్నారు. ఉప ఎన్నికలో మెజార్టీ తీసుకురాలేని ఎమ్మెల్యేలను జగన్ వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టే అవకాశం ఉంది. గతంలో జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులను తీసేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే ఆ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేల మెడపై కత్తి వేలాడుతున్నట్లేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు..

 

Related posts

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju