ప్రస్తుతం మన తెలుగు సినిమా మార్కెట్ బాగా పెరిగిపోయింది. దాంతో పాటు మన స్టార్ హీరోల రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది. స్టార్ హీరోలే కాదు హీరోయిన్లు కూడా రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశారు. ఆ రెమ్యూనరేషన్ చూస్తే కళ్ళు తిరగాల్సిందే. ఆ హీరోల రెమ్యునేషన్ ఎంత? ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
మహేష్ బాబు..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఒకో సినిమాకి 40 నుండి 80 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.
ప్రభాస్..
ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక ప్రభాస్ నాగ అశ్విన్ డైరెక్షన్ లో ఓ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రానికి గానూ ప్రభాస్ వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.
పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం పింకీ రీమేక్ వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి గాను పవన్ 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం.
అల్లు అర్జున్..
ఈ ఏడాది అలా వైకుంఠపురంతో హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి గానూ అల్లు అర్జున్ 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్..
ఇండస్ట్రీలో ఏకసంతాగ్రహిగా, కంప్లీట్ యాక్టర్ గా పేరు పొందిన ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికిగాను ఎన్టీఆర్ 33 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం
రామ్ చరణ్..
మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రామ్ చరణ్ రంగస్థలంతో అందరి మెప్పు పొందారు. ప్రస్తుతం ఈయన రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందుకుగాను రామ్ చరణ్ 33 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం.