పెళ్లి తర్వాత జీవితం లో చాల మార్పులు వస్తాయి.జీవన విధానంలో కూడా చాలా మార్పులు జరుగుతాయి. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. వివాహం తర్వాత జీవనశైలిలో మార్పులు ముందులా జీవించడానికి అనుకూలంగా ఉండక పోవచ్చు. వచ్చిన భాగస్వామి ఆరోగ్యకరమైన పద్ధతులు, అలవాట్లు లేకపోవచ్చు. అయితే రోజూ వ్యాయామం చేయటకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఈ కారణంగా బరువుపెరుగుతారు.
ఒకసారి శృంగారం లో పాల్గొనటం మొదలైన తరువాత స్త్రీలకు వెనుక భాగము, ఛాతి భాగం లో కొవ్వు పేరుకుపోతుంది అని చాలా మంది అపోహ పడుతుంటారు. మగవారు స్ఖలించిన వీర్యం వల్ల ఇలా జరుగుతుందని అనుకుంటారు. కానీ, ఇది మాత్రం నిజం కాదు. పూర్తిగా అపోహే..కొన్ని పరిశోధనలు పెళ్ళి తరువాత బరువు పెరుగుతున్నట్టు నిరూపించాయి. అయితే ఈ బరువు పెరగడం కేవలం ఆడవాళ్ళకీ మాత్రమే కాదు, మగవాళ్ళకీ జరుగుతుంది. కొత్తగా పెళ్ళయినవారి మధ్య అపార్థాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం.
అలాగే కొత్తగా పెళ్ళయిన అమ్మాయికి రకరకాల భయాల తో ఒత్తిడి కి గురవుతారు. ఈ విషయాల గురించి మరీ లోతుగా ఆలోచిస్తే మానసిక ఆందోళన, ఎక్కువవుతుంది. బరువు పెరగడానికి ఒక రకంగా ఇది కూడా కారణం కావచ్చు. పెళ్ళయిన తరువాత రకరకాల పిండివంటల తో విందులు తో పాటు బయట ఎక్కువగా తింటుంటారు. బరువు పెరగడానికి ఇది కూడా కారణమే. పెళ్ళి తరువాత వచ్చే భద్రతా, మన కోసం ఒకరున్నారన్న భావన తో వచ్చే ప్రశాంతత వల్ల కూడాబరువు పెరుగుతారు.మీరు పెళ్ళి తరువాత బరువు పెరగకూడదు అనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ రోజు వ్యాయామం చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. అనవసరమైన అనుమానాలు వదిలేసి మీ శృంగార జీవితాన్ని హాయిగా అనుభవించండి .