పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం అనేది చాలా డేంజర్. కాబట్టి బెల్లి ఫ్యాట్ ను తగ్గించుకునే అందుకు తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే శరీరంలో కొవ్వు పెరిగిపోయి పొట్ట పెరిగిపోతుంది.
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ముందుగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ను కరిగించడం చాలా ముఖ్యం. సరైన వ్యాయామం లేకపోయినా పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అయితే పొట్ట కొవ్వు పెరిగితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే బెల్లి ఫ్యాట్ రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ పొట్ట కొవ్వు త్వరగా తగ్గాలంటే మీ డైట్లో వాము చేర్చుకోవాలి.
అధిక బరువుతో బాధపడుతున్నవారికి వాము ఎంతో మేలు చేస్తుంది. ఒక లీటర్ నీటిలో ఒక టీ స్పూన్ వాము వేసి బాగా మరిగించి ఆ తర్వాత ఆ నీటిని చల్లారనిచ్చి రోజులో కొంచెం కొంచెంగా తాగుతూ ఉండాలి. ఇది బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ వాము నీరు వల్ల పొట్ట దగ్గర కొవ్వు వేగంగా కరుగుతుంది. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి సబ్జా గింజలను కూడా మీ డైట్ లో చేర్చుకోవచ్చు. ఇందులో విటమిన్ ఏ, ఈ, కే మరియు బీ ఉంటాయి. అలాగే, డైటరీ ఫైబర్, కాపర్, క్యాల్షియం, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి తగినంత పోషణను అందిస్తాయి. ఇవి మన శరీరాన్ని డిటాక్సిఫై చెయ్యడం లో సహాయపడతాయి. సబ్జా గింజలు ఇలా చెయ్యడం వలన తేలికగా బరువు తగ్గొచ్చు.