Sonu Sood Crazy Movie: సోనూ సూద్ అంటే ఇప్పుడు ఒక రియల్ హీరో.. దేశంలోని పల్లె, పట్టణాలకు పాకిన హీరో.. ఆయన ఏం చెప్పినా అది చేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు.. ఆయన ఏం అడిగినా అది చేయడానికి యువత సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో సోనూ సూద్ ఫ్లెక్సీలు, విగ్రహాలు, గుడులు కూడా సిద్ధం చేసేస్తున్నారు. తన ఆస్తుల్లో దాదాపు 25 శాతం సోనూ సూద్ ఈ ఏడాదిలోనే ఖర్చు చేసేసారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో ఆయన దేశానికి వెలుగునిచ్చే దీపమయ్యారు. అందుకే ఇప్పటి వరకు సోనూ సినిమాలు వేరు. ఇక మీదట సోనూ సినిమాలు వేరు. ఆయన విలన్ అయినా హీరోనే.. హీరో అయినా హీరోనే… ఆడేస్తాయి…! షారుఖ్, అమితాబ్, చిరంజీవి, రజని కాంత్ లని మించిన ఆశ్చర్యం అవసరం లేదు.. అందుకే ఈ తరుణంలో సోనూ సూద్ కోసం ఓ క్రేజీ ప్రాజెక్టు సిద్ధమవుతోంది..
Sonu Sood Crazy Movie: పాన్ ఇండియా సినిమా కోసం ప్లానింగ్..!
మన తెలుగు దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) సోనూ సూద్ తో ఒక పాన్ ఇండియా సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు ప్రాణం పొసే సోనూని, కేజీఎఫ్ తరహాలో యాక్షన్ తో పాటూ, ఓ సెంటిమెంట్ డ్రామాతో కథని సిద్ధం చేసేపనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయనకు లైన్ వినిపించారట. సోనూ కూడా ఒకే చేయడంతో రెండు నెలల్లో కథని పూర్తిగా రెడీ చేసుకుని ఆగష్టులో షూటింగ్ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. అప్పటికి కరోనా రెండో దశ కూడా పూర్తవుతుందని నమ్ముతున్నారు.
* క్రిష్ – సోనూ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ఇద్దరూ మణికర్ణికా సినిమాకు పని చేసారు. ఆ సినిమాలో సోనూ కీలక రోల్ లో నటించినా కంగనాతో పొసగక మధ్యలో డ్రాప్ అయ్యారు. అదే సినిమాకి దర్శకుడిగా క్రిష్ మూడొంతుల భాగం పని చేసి వచ్చేసారు. ఇక్కడితో ఈ ఇద్దరి మధ్య బాండింగ్ కుదిరింది. అప్పటి నుండి ఇద్దరూ ఓ ప్రాజెక్టు కోసం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సోనూ క్రేజ్ బాగా పెరగడంతో అందుకు తగ్గట్టుగా క్రిష్ కథని సిద్ధం చేస్తున్నారట.