NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Corona: క‌రోనా విష‌యంలో కేంద్రం ముచ్చ‌ట న‌మ్మేలా లేదు… ఓవైసీ సంచ‌ల‌నం…

Corona: హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ క‌రోనా విష‌యంలో మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2021 చివరి నాటికి దేశంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందిస్తామని కేంద్రం చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌ను ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. 108 కోట్ల మంది ప్రజలకు డిసెంబర్ ఆఖరు కల్లా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్ర‌క‌టించ‌డాన్ని ఓవైసీ దుయ్య‌బ‌ట్టారు. ఈ ఏడాది డిసెంబర్‌‌కల్లా 216 కోట్ల డోసులు ఎలా సాధ్యం? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

Read More: Eatela Rajendar: ఈట‌ల రాజేంద‌ర్‌… కొంత క్లారిటీ …. ఎంతో కన్ఫ్యూజ‌న్‌….

కేంద్రం ఏం చెప్తోంది?

దేశంలోని 130 కోట్ల మంది జనాభాలో మూడు శాతం కన్నా తక్కువ మంది రెండు డోసులు తీసుకున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కేంద్ర స‌మాచార ప్ర‌చార శాఖ‌ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ, 2021 చివరి నాటికి దేశంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందిస్తామన్నారు . ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించామని పేర్కొన్న కేంద్ర మంత్రి ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్న వేగవంతమైన దేశాల్లో భారత్‌ రెండవదని తెలిపారు. 2021లోపే భారత్‌లో వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తవుతుందని..దీనికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్లూప్రింట్‌ ఇచ్చిందని కేంద్ర మంత్రి వివ‌రించారు.

Read More : KCR: కేసీఆర్ , జ‌గ‌న్ … ఏపీ తెలంగాణ ప్ర‌జ‌ల బాధ‌లు ప‌ట్టించుకోండి!

ఓవైసీకి మండిపోయింది…

అయితే, డిసెంబర్ ఆఖరు కల్లా 108 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్ చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అనడం మీద ఓవైసీ మండిపడ్డారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్ట‌డానికి ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంద‌న్నారు. “ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ నెలల మధ్యలో 216 కోట్ల టీకా డోసులను తయారు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ వ్యాక్సిన్‌‌ల్లో 55 కోట్ల టీకాలు కోవ్యాక్సిన్‌‌వే. కానీ ప్రస్తుతం భారత్ బయోటెక్ రోజుకు 5 లక్షల టీకాలనే తయారు చేస్తోంది. టీకా ఉత్పత్తి వేగాన్ని పెంచి రోజుకు 37 లక్షల వ్యాక్సిన్‌ లను భారత్ బయోటెక్ తయారు చేయాలి. మనల్ని మభ్యపెట్టడానికే ప్రభుత్వం ఇలా చెబుతోంది.. తప్పితే మరొకటి కాదు’ అని ఓవైసీ ట్వీట్ చేశారు.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?