NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

KTR: కేంద్రంపై కేటీఆర్ నిప్పులు… ఏమంటున్నారో తెలుసా?

KTR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మ‌రోమారు కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో కోనసాగిన ట్విట్టర్ సంభాషణలో వాక్సినేషన్ కార్యక్రమంపై ప్రజల నుంచి సలహాలను, సూచనలను మంత్రి కేటీఆర్ స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలను ప్రజలకు వివరించారు. అదే స‌మ‌యంలోనూ కేంద్రంపై మండిప‌డ్డారు.

Read More : Corona: కరోనాతో పిల్లలకు ప్రమాదం లేదు – ఎవరు ప్ర‌క‌టించారో తెలుసా?

అంతా కేంద్రం చేసిందే…

తెలంగాణ లో వ్యాక్సినేషన్ పక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నదని, ఓల్డ్ ఏజ్ హోమ్ ల్లోనూ వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు పది లక్షల మంది ప్రజలకు వ్యాక్సిన్ను వేసే పరిపాలనా పరమైన వ్యవస్థ అందుబాటులో ఉన్నదని అయితే దురదృష్టవశాత్తు ఆ మేరకు అవసరమైన వ్యాక్సిన్ సరఫరా లేదన్నారు. సాధ్యమైనంత త్వరగా అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి ఉందని, కానీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం వలన ఈ ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లను సమకూర్చు కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అయితే దురదృష్టవశాత్తు రాష్ట్రం పిలిచిన గ్లోబల్ టెండర్లకు స్పందన రాలేదన్నారు. అంతర్జాతీయ వ్యాక్సిన్ తయారీదారులు దేశంలోని వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే కన్నా కేవలం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు, కేంద్రానికే వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

Read More: Corona: వాట్సాప్ తో క‌రోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవ‌చ్చంటే…

డ‌బ్బులు ఏమైపోయాయంటున్న కేటీఆర్

భారతదేశ జనాభా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందించాలంటే 272 కోట్ల వాక్సిన్ అవసరం అవుతాయని దీనికి సంబంధించి 150 రూపాయలకు ఒక వ్యాక్సిన్ డోసు చొప్పున కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన 35 వేల కోట్ల రూపాయలను ఉపయోగించాలని, కానీ ఈ బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఎక్కడికి పోయాయో అర్థం కావడం లేదన్నారు. దీంతో పాటు రాష్ట్రాలకు, ప్రైవేట్ కంపెనీలకు, కేంద్ర ప్రభుత్వానికి ఒక తీరున వ్యాక్సిన్ ధరను నిర్ణయించడం పైన కూడా ఆయన ట్విట్టర్లో స్పందించారు. దీంతోపాటు దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లు 85 శాతం కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉన్నాయని మిగిలిన 15 శాతం లో రాష్ట్రాలకు తక్కువ రేటు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఎక్కువ రేటు నిర్ణయించడంతో కంపెనీలు కూడా ప్రైవేటు వర్గాలకే అమ్మేందుకు ముందుకు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు సుముఖంగా లేవన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

Read More: Corona: క‌రోనా టైంలో ఒక్కొక్క‌రుగా మోడీని భ‌లే బుక్ చేస్తున్నారుగా

కేంద్రం మేల్కొన‌లేదు…

దేశంలో వ్యాక్సిన్లు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా ప్రజలకు ఎందుకు అందుబాటులో లేవన్న విషయానికి సంబంధించి మంత్రి కేటీఆర్ పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. ఇతర దేశాలు గత సంవత్సరమే మేల్కొని పెద్దఎత్తున ఆయా కంపెనీలకు వ్యాక్సిన్లు సరఫరా కోసం ఆర్డర్ ఇచ్చాయని, అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరిలో మేల్కొన్న దన్నారు. దీంతో పాటు ఇతర దేశాలు తమ ప్రజలకి పెద్దఎత్తున వ్యాక్సిన్ సరఫరాను అందించే ప్రయత్నం చేస్తుంటే భారత సర్కారు మాత్రం వ్యాక్సిన్ మైత్రి మరియు విదేశాలకు వాక్సిన్ ఎగుమతుల ప్రమోషన్ లకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి ఉందన్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju