NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy Effect: టీపీసీసీలో ప్రకంపనలు స్టార్ట్..! ఎంపి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

Revanth Reddy Effect: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ని పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి జూలై 7వ తేదీన పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులను తోసి రాజని టీడీపీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం అప్పగించడంతో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు హార్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడుగా డిక్లేర్ చేయడంతో సీనియర్ కాంగ్రెస్ నేత, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన శశిధర్ రెడ్డి తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు.

Revanth Reddy Effect: MP Komati reedy sensational comments
Revanth Reddy Effect: MP Komati reedy sensational comments

Read More: MAA Polls: ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు మనోగతం ఇది..!!

మరో పక్క టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన సీనియర్ నేత, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీపీగా టీపీసీసీ మారిపోతుందని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు మాదిరిగా పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకున్నారని త్వరలోనే అధారాలతో సహా బయట పెడతానని అన్నారు. శవాల మధ్య సోనియా గాంధీ విగ్రహం పెట్టాలన్న వ్యక్తికి పీసీసీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పార్టీలో యాక్టివ్ గా ఉన్న ఫిరోజ్ ఖాన్ కు పదవి ఇవ్వకుండా మూడేళ్లుగా గాంధీ భవన్ కు రాని అజహరుద్దీన్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా అని ప్రశ్నించారు. 2023 ఎన్నికల వరకూ గాంధీ భవన్ మెట్లెక్కనని అన్నారు. టీడీపీ నుండి వచ్చిన నేతలు ఎవరూ తనను కలవవద్దని అన్నారు. నూతన అధ్యక్షుడుతో సహా ఆ కమిటీ నేతలు తనను కలవాలని ప్రయత్నించవద్దని సూచించారు.

Revanth Reddy Effect: MP Komati reedy sensational comments
Revanth Reddy Effect: MP Komati reedy sensational comments

తన నియోజకవర్గం, జిల్లా కే పరిమితం అవుతాననీ, తన రాజకీయ భవిష్యత్తును కార్యకర్తలే నిర్ణయిస్తారన్నారు. సోనియా, రాహుల్ పై విమర్శలు చేయనని పేర్కొన్న కోమటిరెడ్డి.. సోమవారం నుండి ఇబ్రహీంపట్నం నుండి భువనగిరి వరకూ పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త నాయకత్వంలో హుజూరాబాద్ లో డిపాజిట్లు తెచ్చుకోవాలన్నారు. టీపీసీసీలో అసలైన కార్యకర్తలకు గుర్తింపు లేదని వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 30 సంవత్సరాలకుపైగా పార్టీలో ఉన్న తనను నూతన కమిటీ ఏర్పాటు విషయంపై కనీసం సంప్రదించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N