Sleep: సుఖవంతమైన నిద్ర ను పొందాలంటే మనం ఎటువైపు తిరిగి పడుకోవాలి అనే అంశం కూడా ముఖ్యమే అంటున్నారు పరిశోధకులు. ఎడమ వైపు తిరిగి పడుకుంటే మంచి నిద్ర,ఆరోగ్యం కూడా పొందవచ్చట. ఎడమ వైపు తిరిగి నిద్ర పోయే వారిలో 60% మంది ఉదయం లేచిన తర్వాత చాలా చురుకుగా సంతోషంగా ఉంటారు. అదే కుడివైపు తిరిగి పడుకునే వారిలో అశాంతి, నిద్రలేమి వంటివి చోటు చేసుకుంటున్నట్టు గా పరిశోధకులు గుర్తించారు.
నిద్రించేటప్పుడు మాత్రమే ఎడమవైపు తిరిగి నిద్రపోవాలి.. ఉదయాన నిద్ర లేచేటప్పుడు మాత్రం మీరు ఎటువైపు ఉన్న కుడివైపునకు తిరిగి మాత్రమే లేవాలని మన పెద్దలు తెలియచేస్తున్నారు. నేటి పరిశోధకులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తూ పాటించాల్సిన అంశంగా తెలియచేస్తున్నారు.అయితే నిద్ర పోయేటప్పుడు తూర్పు ,ఈశాన్యం , పడమర దిశలో తల పెట్టుకుని ఉన్న పర్వాలేదు .. కానీ దక్షిణ దిశగా తల పెట్టడం మాత్రం అన్నింటికంటే మంచిది అని తెలియ చేస్తున్నారు.భూమి పై అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి అన్న సంగతి తెలిసిందే . ఈ అయస్కాంత శక్తి ప్రభావం వల్ల ఉత్తర దిశ వైపు తలపెట్టి పడుకోవద్దు అని అంటుంటారు. ఉత్తర దిశలో తల పెట్టి ఐదు లేదా ఆరు గంటలు నిద్రపోయినప్పుడు.. అయస్కాంత శక్తి ఆకర్షించడం వల్ల మెదడు పై ఒత్తిడి పెరుగుతుంది. అదే పెద్ద వయసు వారిలో అయితే రక్తనాళాలు కొంత బలహీన పడి ఉంటాయి కనుక వారి మెదడులో రక్తస్రావం జరిగి పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.ఒకవేళ చక్కని ఆరోగ్యవంతులైన వారు ఇలా చేస్తే వారిలో పెద్ద ప్రమాదం ఏమీ కనిపించినప్పటికీ, వారు కూడా నిద్ర లేస్తూనే ఆందోళనగా ఉన్నట్టు కనిపిస్తారు.
ఎప్పుడో ఒక రోజు ఉత్తర దిశగా తలపెట్టి నిద్రించడం వల్ల ప్రమాదం బారిన పడతారని, ప్రాణం కోల్పోతారని దీని అర్థం కాదు. కానీ, నిత్యం ఇదే పనిచేస్తుంటే మాత్రం కొంత కాలానికి అయస్కాంత శక్తి ప్రభావం వలన మెదడు పై ఒత్తిడి పెరిగి పోయి సమస్యల బారిన పడటం ఖాయం అని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. అది ఎటువంటి సమస్యలు అన్నది శరీర నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. గందరగోళం,తలనొప్పి, మెదడు చురుకుదనం తగ్గడం వంటి ప్రభావాలు కనిపిస్తాయని నిపుణులు తెలియచేస్తున్నారు.