NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ayyanna patrudu: జగన్ పై అయ్యన్న సంచలన వ్యాఖ్యలు..!!

ayyanna patrudu: ఏపి (AP)లో రాజకీయ నేతల మధ్య బూతు తిట్ల పురాణం ఇప్పట్లో ముగిసేలా లేదు. టీడీపీ (TDP) అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ (పట్టాభి) Pattabhi రెండు రోజుల క్రితం ఏపి సీఎం జగన్ (CM YS Jagan) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ అభిమానులు హర్ట్ అటు పట్టాభి నివాసంపై మరో పక్క టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు చేశారు. దీన్నే టీడీపీ అస్త్రంగా మారల్చుకుని అధికార వైసీపీని ఇబ్బందులు పెట్టడానికి చంద్రబాబు వ్యూహాన్ని సిద్దం చేసుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ ఆరాచక పాలన సాగుతోందంటూ కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధం అయ్యారు. నేడు ఢిల్లీకి చంద్రబాబు బృందం బయలుదేరి వెళుతోంది. మరో పక్క హైకోర్టు నుండి పట్టాభికి ఉప శమనం లభించడంతో టీడీపీ నేతలు పట్టాభి ఉపయోగించిన వివాదాస్పద పదాన్ని వాడుతూ వైసీపీపై ఎదురుదాడి చేస్తోంది. వైసీపీ చర్యలను నిరసిస్తూ టీడీపీ నేతచంద్రబాబు 36 గంటల దీక్ష చేయగా, పట్టాభి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ జనాగ్రహ దీక్షలను నిర్వహించింది.

ayyanna patrudu serious comments on ys jagan
ayyanna patrudu serious comments on ys jagan

ayyanna patrudu: సింపథీ కోసమే పదానికి పెడ అర్ధాలు

ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మరో సారి జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై విమర్శలు గుప్పించారు. బొషిడికే అన్న పదానికి తెలంగాణ పదకోశంలో ఉన్న అర్ధాన్ని వివరించారు అయ్యన్న పాత్రుడు. పట్టాభి అసలు ఆ పదాన్ని సలహదారు సజ్జల ను ఉద్దేశించి అంటే దాన్ని సీఎం జగన్ తనకు తానే అన్వయించుకున్నారని విమర్శించారు. సింపతీ వస్తుందంటే తన ముఖం మీద తానే ఉమ్మేసుకునే రకం వైఎస్ జగన్ అని మండిపడ్డారు. ఓట్లు, సీట్లు వస్తాయని తండ్రి, బాబాయ్ శవాల దగ్గరనుండి కోడికత్తి వరకూ దేనిని వదలని జగన్ రెడ్డి బోసిడికె పదాన్ని వదులుతాడా? అని ప్రశ్నించారు. తెలంగాణ పదకోశంలో బోసిడికె అంటే ‘పాడై పోయిన’ అనే అర్థముందని పేర్కొన్నారు. సానుభూతి కోసం ఎంతకైనా దిగజారే జగన్ రెడ్డి … సలహాల సజ్జలని బోసిడికె అంటే..అది తననే అన్నారని అన్వయించుకుని, బోస్డీకే పదానికి పెడార్ధాలు తీసి తల్లి పేరుతో కొత్త సెంటిమెంట్ కార్డ్ బయటకి తీసాడని అన్నారు.

బూతులు తిట్టిన వారికి మంత్రిపదవులు

తల్లిపై నిజంగా ప్రేమ ఉంటే, తల్లిని బూతులు తిట్టిన వారికి మంత్రి పదవులు ఇవ్వడనీ, తల్లిని, చెల్లిని అలా తెలంగాణ రోడ్లపై అనాథలుగా వదిలేయడని పేర్కొన్నారు. ఇంతకు ముందు జగన్ పై అయ్యన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు నివాసంపైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇది జరిగి రెండు వారాల వ్యవధిలోనే వైసీపీ అభిమానులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం గమనార్హం. ఈ తరుణంలో ఇరుపక్షాల నేతలు మధ్య విమర్శలు, ప్రతివిమర్శల దాడి కొనసాగుతోంది. ఈ వివాదం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో వేచి చూడాలి.

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju