NewsOrbit
రాజ‌కీయాలు

YS Sharmila: సీబీఐకి షర్మిల సెన్షేషనల్ లేఖ ..!? అందుకే ఎల్లో మీడియా అనేది..!?

YS Sharmila : టీవీ 5, ఏబీఎన్, ఈటీవీ, ఈనాడు, ఆంధ్ర జ్యోతిలను వైసీపీ బ్యాన్ చేసింది.. ఆ విషయన్ని మంత్రి కొడాలి నాని స్వయంగా వెల్లడించారు.. ఇది సబబా, కదా..!? అనే చర్చ అన్ని వర్గాల్లో జరుగుతుంది. కాకపోతే ఆ మీడియాలు చేస్తున్న అతి ప్రచారం, ఆ టీవీల్లో నడుస్తున్న అసత్య కథనాల వలన బ్యాన్ చేసినా తప్పులేదు అనుకోవాల్సి వస్తుంది.. ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుబులు రేకిత్తించే వార్త ఒకటి నాలుగు రోజుల కిందట టీవీ 5 లో ప్రసారం అయ్యింది. అందరికీ గుర్తుండే ఉంటుంది.. ఆ వార్త సారాంశం ఏమిటంటే.. వైసీఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా ( Ys Sharmila )  రెడ్డి సీబీఐ పెద్దలకు వైఎస్ వివేకా హత్యకు సంబంధించి కీలక విషయాలను తెలియజేస్తూ లేఖ రాయనున్నట్లు వెల్లడించింది. ఆ తరువాత ఇదే విషయాన్ని టీడీపీ అనుకూల మీడియాలో ప్రసారం చేశాయి. ఈ వార్త ఏపి రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. ఇదే గనుక వాస్తవం అయితే రాష్ట్ర రాజకీయాల్లో సంచలన అంశమే. తమ సొంతం కుటుంబంలో జరిగిన ఈ ఘటనపై షర్మిల.. సీబీఐకి లేఖ రాయడం అంటే మామూలు విషయం కాదు. వివేకా కుటుంబ సభ్యురాలిగా ఆమెకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి. ఆమే గనుక లేఖ రాస్తే అది తీవ్ర సంచలనం అవుతుంది. నిజంగా ఆమెకు ఆ ఉద్దేశం ఉందా..? ఆమె సీబీఐకి లేఖ రాసే అవకాశం ఉందా..? ఈ లేఖ రాస్తున్న అంశాన్ని నమ్మవచ్చా..? అయితే మీడియా వాళ్లు దాన్ని దృవీకరించలేదు. లేఖ రాయాలి అని అనుకుంటున్నారు అని మాత్రమే చెప్పారు.

Sharmila's sensational letter to CBI
Sharmila’s sensational letter to CBI

YS Sharmila: లేఖ రాసె ఉద్దేశం లేనట్టే..!?

అయితే ఈ వార్తపై “న్యూస్ ఆర్బిట్” పలు వర్గాల నుండి సేకరించిన వివరాల ప్రకారం షర్మిలారెడ్డి సీబీఐకి లేఖ రాసే ఉద్దేశంలో లేరని తెలిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆమె లేఖ రాసే అవకాశం లేదని సమాచారం. సోదరుడు జగన్మోహనరెడ్డితో షర్మిలకు కొంత గ్యాప్ ఏర్పడిందని ఇటీవల మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తన సోదరుడిని దారిలో తెచ్చుకునేందుకు కొన్ని కొన్ని అస్త్రాలను ఆమె బయటకు తీస్తున్నారన్న ప్రచారం ఉంది. ఏపిలో పార్టీ పెడతానని ఒకటవ లీక్. పార్టీ పెడతారో లేదో అనేది తరువాత విషయం. కానీ జగన్ ఒక ఆలోచనలో పడతారు కదా. ! ఏపిలో షర్మిల పార్టీ పెడితే వైసీపీకి కొంత నష్టం జరుగుతుందనేది అందరికీ తెలిసిందే.

Sharmila's sensational letter to CBI
Sharmila’s sensational letter to CBI

* వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐకి లేఖ అంటూ రెండో లీక్. ఇవన్నీ కూడా బెదిరించి తనకు కావాల్సింది చేయించుకోవడం షర్మిల ఎత్తుగడ అని అనుకుంటున్నారు. ఏపి షర్మిల పార్టీ పెడుతుందా అంటే పెట్టే అవకాశమే లేదు. సీబీఐకి లేఖ రాసే అవకాశం కూడా లేదు. ప్రస్తుతం షర్మిలకు సంబంధించి ఏపిలో పార్టీ ఏర్పాటు విషయం గానీ, వివేకా హత్య విషయంలో లేఖ రాస్తారని వస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టమైన సమాచారం. అయితే తనకు సంబంధించి ఆస్తి లావాదేవీలు సెటిల్ చేసుకునేందుకే షర్మిల ఈ విధమైన వ్యూహం సిద్దం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
* ఏమి లేకుండా బ్రేకింగ్ అంటూ షర్మిల లేఖ అంటూ నానా హడావిడి చేసి.. సీబీఐ కి నిజంగా లేఖ రాసినట్టు బిల్డప్ ప్రసారం చేసిన టీవీ 5 ఇప్పుడు బకరా అయింది. నాలుగు రోజులయినా ఆ లేఖ వాస్తవమే అని తేలకపోవడంతో టీవీ 5 ని ఎల్లో అన్నా తప్పులేదని భావన తటస్థ వర్గాల్లో కూడా నెలకొంది..!

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!