NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Politics: తెలంగాణ పాలిటిక్స్ బాంబ్..! టిఆర్ఎస్ నుండి 35 మంది జంప్..!?

Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు పార్టీలు సిద్ధం అవుతున్నాయి షెడ్యుల్ ప్రకారం 2023 నవంబర్ లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. కానీ కేసిఆర్ ముందస్తు సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకంతో ముందుకు వెళితే 2023 మార్చి, ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఎన్నికలకు ఏడాది మాత్రమే గడవు ఉంది. ఈ ఏడాది ఇక పొలిటికల్ సీజన్ గా పేర్కొనవచ్చు. అందుకే రాజకీయ పార్టీలు అన్నీ అప్రమత్తం అయ్యాయి. ఇటు టీఆర్ఎస్ తమ ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెరవెనుక ప్రయత్నాలు, తెర ముందు ప్రయత్నాలు చేస్తుండటంతో పాటు చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ బహిరంగ సభలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సమర్ధతను నమ్ముకుంది. ఇప్పుడిప్పుడే పాత కాంగ్రెస్ నాయకులు యాక్టివ్ అవుతున్నారు. విభేధాలను సరిచేసుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరో పక్క బీజేపీ కూడా తన వ్యూహాలను సిద్ధం చేసుకుంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు, ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీమ్ యాక్టివ్ అవుతోంది.

Telangana Politics BJP MLA Raghunandan rao key comments
Telangana Politics BJP MLA Raghunandan rao key comments

Read More: AP Politics: టీడీపీకి డేంజర్ సిగ్నల్..! ఏపిలో బీహార్ తరహా ప్లాన్ అమలు..!

Telangana Politics: రఘునందనరావు కీలక వ్యాఖ్యలు

రఘునందనరావు రీసెంట్ గా ఓ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ చిటికేస్తే ఉన్నపళంగా 35 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో 45 మంది ఎమ్మెల్యేల మరో పార్టీతో టచ్ లో ఉన్నారు. ఎనీటైమ్ ఆ పార్టీలోకి వెళతారు అంటూ సినీనటుడు శివాజీ కామెంట్స్ చేశారు. శివాజీ చెప్పిన మాటలను కొన్ని పార్టీలు, వర్గాలు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. శివాజీ ఒక వర్గానికి, ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి, ఒక పార్టీకి పూర్తిగా వ్యతిరేకం కాబట్టి అంతగా పట్టించుకోనవసరం లేదు. కానీ తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి రఘునందనరావు బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి. కానీ ఆయన మాట చాలా నిక్కచ్చిగా ఉంటుంది. చాలా సబ్జెక్ట్ తో తెలివిగా మాట్లాడతారు. స్వతహాగా
ఆయన ఒక జర్నలిస్ట్. ఒక్కోసారి కేసిఆర్ ను అభిమానిస్తాను అని కూడా చెప్పారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి ఆయన. అటువంటి రఘునందనరావే టీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు, కేసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చడం మాకు చాలా ఈజీగా అన్నట్లుగా మాట్లాడారు అంటే తెలంగాణ రాజకీయాలు ఎంత వేడిగా ఉన్నాయో అర్ధం అవుతుంది.

కేసులు, విచారణ లేకుండా జైలుకు ఎలా..?

అలానే బండి సంజయ్ కూడా కేసిఆర్ జైలుకి, జైలుకి అంటుంటారు. కేసిఆర్ పై ఢిల్లీలో ఫైల్స్ రెడి అవుతున్నాయి. అమిత్ షా ఒక చిటికే వేస్తే చాలు కేసిఆర్ జైలుకు వెళ్లిపోతారు అంటారు. ఇప్పటి వరకూ ఒక్క అవినీతి నిరూపితం అవ్వలేదు. కేసులు పడాలి, విచారణ జరగాలి, వాదనలు జరగాలి అప్పుడు జైలుకు వెళ్లాలి. కనీసం కేసులు నమోదు కాకుండా, విచారణే మొదలు కాకుండా జైలుకు జైలుకు అని బండి సంజయ్ అలా ఎందుకు అంటారో ఎవరికి అర్ధం కాదు. అయితే ఇప్పుడు రఘునందనరావు చేసిన కామెంట్స్ యే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం మారాయి.

 

15 నుండి 18 మంది ఎమ్మెల్యేలు అయితే సిద్ధం..?

రఘునందనరావు అన్నట్లు 35 మంది ఎమ్మెల్యేలు కాదు కానీ 15 మంది వరకూ 18 వరకూ జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా కేసిఆర్ వద్ద ఉన్నాయి. అందులో ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. కానీ రఘునందనరావు 35 మంది ఎమ్మెల్యేలు అనడంతోనే సంచలనం అయ్యింది. ఇలా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల టీఆర్ఎస్ అంతర్గతంగా చేయించుకున్న సర్వేలో ప్రభుత్వంలోకి రావడం కష్టమే, మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా టిఆర్ఎస్ ఉంటుంది. ఎంఐఎం మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది అన్న టాక్ ఉంది. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంటామన్న నమ్మకంతో ఉంది. మొత్తానికి తెలంగాణలో ఎవరి అంచనాల్లో, ఎవరి లెక్కల్లో వాళ్లు ఉన్నారు.

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N