NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Three Capitals: వికేంద్రీకరణ విషయంలో తగ్గేదెలే..! అసెంబ్లీలో స్పష్టం చేసిన సీఎం వైఎస్ జగన్..కోర్టు తీర్పుపై ఏమన్నారంటే..?

AP Three Capitals: రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. ఏపి అసెంబ్లీలో మూడు రాజధానుల అంశంపై జరిగిన చర్చ సందర్బంగా సీఎం జగన్..రాజధాని వికేంద్రీకరణ విషయంపై హైకోర్టు తీర్పును ఆక్షేపించారు. రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తూ కేంద్రం హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇంత స్పష్టంగా కేంద్రం అఫిడవిట్ ఇచ్చిన తరువాత కూడా పరిపాలనా వికేంద్రీకరణ పై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదనీ, రాజధాని పై కేంద్రం నుండి అనమతులు తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏమి లేదని చెప్పిందన్నారు.

CM YS Jagan Speech in Assemly on AP Three Capitals Issue
CM YS Jagan Speech in Assemly on AP Three Capitals Issue

 

లక్ష కోట్లతో నెల రోజుల్లో రాజధాని కట్టేయాలని కోర్టులు ఎలా డిక్టేట్ చేస్తాయని ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో ఉండాలి లేకుంటే సిస్టమ్ మొత్తం కుప్పకూలిపోతుందన్నారు. రాజధానిపై వాళ్లంతకు వాళ్ల ఊహించుకుని అటు గుంటూరు, ఇటు విజయవాడ కాకుండా తమకు బినామీలకు భూములున్న చోట రాజధాని పెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారు కాబట్టే వైసీపీకి ప్రజలు ఘన విజయం కట్టబెట్టారని అన్నారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని శివరామకృష్ణ కమిటీ కూడా స్పష్టం చేసిందన్నారు జగన్. శాసన వ్యవస్థలు ఓ చట్టాన్ని చేయాలా వద్దా అని కోర్టులు నిర్ణయించలేవన్నారు.

 

రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం ఒక్క శాసన వ్యవస్థకే ఉందని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా ఆచరణ సాధ్యం కాని తీర్పు హైకోర్టు ఇచ్చిందన్నారు. వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో మాటలన్నింటికీ కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ మరో మారు స్పష్టం చేశారు. తమకు హైకోర్టు పై గౌరవం ఉందని అలానే రాష్ట్ర అసెంబ్లీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ రోజు చర్చ జరగకపోతే చట్టాలు చేయాల్సింది శాసనసభా లేదా కోర్టులా అనేది క్వశ్చన్ మార్క్ అవుతుందన్నారు. న్యాయసలహాలు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చలు జరుపుతున్నామన్నారు సీఎం జగన్. అందరికీ మంచి చేయడానికే తమ ప్రభుత్వం ఉందన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన వారికి న్యాయం చేస్తామనీ, వికేంద్రీకరణ విషయంలో వెనుకడుగు వేసేది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju