గుడ్డు సంపూర్ణ పోషకాహారం.. గుడ్డు ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే.. రోజుకొక గుడ్డు తినమని వైద్యులు చెబుతుంటారు.. కోడిగుడ్డుతో పాటు వీటిని కలిపి తీసుకుంటే ఫాస్ట్ గా బరువు తగ్గొచ్చు.. అదెలాగో ఇప్పుడు చూద్దాం..!
నల్ల మిరియాలు;
నల్ల మిరియాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మీరు గుడ్డు ఉడకపెట్టి తినేటప్పుడు దానిపైన కొద్దిగా నల్ల మిరియాల పొడి చల్లుకొని తినండి. అలాగే కోడిగుడ్లు ఆమ్లెట్ గా వేసుకునేటప్పుడు కారం పొడి కాకుండా నల్ల మిరియాల పొడి వేసుకొని ఆమ్లెట్ కనుక తింటే సులువుగా బరువు తగ్గుతారు. గుడ్డుతో నల్ల మిరియాల పొడి కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది..
కొబ్బరి నూనె:
శరీరంలో కొవ్వును కరిగించడానికి కొబ్బరి నూనె కీలకపాత్ర పోషిస్తుంది. అన్ని వంట నూనెలలో కెల్లా కొబ్బరి నూనెతో చేసిన వంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీరు కోడుగుడ్డుతో గనుక ఆమ్లెట్ వేసుకునేటప్పుడు మాత్రం సాధారణమైన వంట నూనె కాకుండా కొబ్బరి నూనెతో వేసుకుని తింటే.. శరీరంలోని విషవ్యార్ధాలను బయటికి నెట్టడంతో పాటు అధిక కొవ్వులు కూడా కరిగిస్తుంది..
క్యాప్సికం:
క్యాప్సికంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది .ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కోడిగుడ్డును మీరు ఏ విధంగా తీసుకున్న కూడా దానితోపాటు క్యాప్సికం మొక్కలను కూడా జత చేసుకోండి. ఉడకబెట్టిన గొడ్డు గుడ్డు తినేటప్పుడు అందులో కొన్ని క్యాప్సికం మొక్కలను కలిపి తీసుకోండి. లేదు ఆమ్లెట్ వేసుకునేటప్పుడు పచ్చిమిర్చి బదులు క్యాప్సికంలో యాడ్ చేసుకోండి. రుచికి రుచితో పాటు ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఇది కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది..