Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయ్యే అప్పుడే వారం రోజులు అయిపోయింది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా హౌస్ లో కనబడటం లేదన్న టాక్ ప్రేక్షకుల నుండి వినిపిస్తోంది. కంటెస్టెంట్ల పరంగా ఇలా ఉంటే.. సీజన్ సిక్స్ లో షో నిర్వాహకులు కొన్ని మార్పులు చేర్పులు చేయటం పట్ల ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. గత ఐదు సీజన్లలో ఒకే తరహాలో షో ఫార్మేట్ ప్రసారమయింది.
అయితే సీజన్ సిక్స్ గత సీజన్లకు భిన్నంగా మొట్టమొదటి వారంలో ఇంటి సభ్యులను ఎలిమినేట్ చేయకపోవడం.. ఇంకా “స్టార్ ఆఫ్ ద వీక్” అనే టాస్క్ ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు తెలపటం పట్ల ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు టాస్కులు పరంగా కూడా కొన్ని మార్పులు రానున్న రోజుల్లో చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఒక వారంలోనే ఈ రెండు మార్పులు హౌస్ లో చేయడం వల్ల.. బిగ్ బాస్ గేమ్ తెలిసిన కొంతమందికి.. పరిస్థితులను అంచనా వేయడం రానున్న రోజుల్లో కష్టమవుతుందని చెప్పుకొస్తున్నారు.
ఏది ఏమైనా తెలుగు బిగ్ బాస్ అనీ సీజన్ లలో కంటే ఆరో సీజన్ ప్రారంభంలోనే చాలా వైవిధ్యంగా.. చూసే ప్రేక్షకులకు సైతం అంచనా వెయ్యలేని రీతిలో హౌస్ లో వాతావరణం సృష్టించడంలో బిగ్ బాస్ టీం సక్సెస్ సాధించినట్లు బయట బలమైన టాక్ వినిపిస్తోంది. మరి ఇదే రీతిలో రాబోయే ఎపిసోడ్ లలో అనేక షాక్ లు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇవ్వాలని జనాలు అంటున్నారు. ఆటనీ అంచనా వేసే దిగ్గజాలు హౌస్ లో చాలామంది ఉన్నారని ఆడియన్స్ నుండి వినబడుతున్న టాక్.