NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu Today Episode October 11 : వసును నా నుంచి దూరం చేసి నన్ను మళ్ళీ ఒంటరి చేయకండి అని జగతిని వేడుకున్న రిషి..!!

Guppedantha Manasu Today Episode October 11

Guppedantha Manasu Today Episode :గుప్పెడంత మనసు 578వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.ఈరోజు అక్టోబర్ 11 ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.

Guppedantha Manasu Today Episode 578 October 11:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ గుప్పెడంత మనసు. మంచి కథ, కథనంతో ముందుకు సాగుతూ 578వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 11న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం

Guppedantha Manasu Today Episode October 11 Review
Guppedantha Manasu Today Episode October 11 Review


జగతి కళ్ళు తిరిగి పడిపోవడంతో వసు, రిషి కంగారుగా ఇంటికి వస్తారు. ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది. పాపం. జగతి ఎంతో బాధగా జీవితం అనే బొమ్మల కొలువలో నేనే ఒక దోషగా మిగిలాను అని జగతి అంటుంది.వసు మాత్రం జ్యూస్ తీసుకోండి అని అంటుంది. అప్పుడే బయట నుంచుని ఉన్న రిషిని వసు, మహేంద్ర చూస్తారు. మేడం మీరు జ్యూస్ తాగుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రిషి దగ్గరికి వెళ్తుంది వాసు వాసన చూసిన రిషి ఎలా ఉన్నారు మేడం అంటే అలానే ఉన్నారు.


మేడం గురించి రిషి టెన్షన్ :


డాక్టర్ శరీరానికి ట్రీట్మెంట్ చేస్తారు మనసుకు కాదు కదా అని వసు అంటే జాగ్రత్తగా చూసుకో వసుధరా అని చెప్పి రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక వసు లోపలికి రాగానే మహేంద్ర కూడా బయటకు వచ్చేసి అమ్మా వసు మేడంను. జాగ్రత్తగా చూసుకో అని రిషి దగ్గగరకు వచ్చి చాటుగా చూసే బదులు డైరెక్ట్ గా వచ్చు చూడొచ్చు కదా అంటాడు. డాడ్ మేడంకు త్వరగా తగ్గేలా చుడండి అని టెన్షన్ పడుతూ మాట్లాడతాడు. జగతికి నయం అయ్యే మెడిసిన్ దొరకటం లేదు రిషి అని మహేంద్ర అంటే దొరకక పోవడం ఏంటి డాడ్ కావాలంటే ఫారిన్ కంట్రీ నుంచి అయినా తెప్పించండి డాడ్ అని అంటాడు ఋషి.

Guppedantha Manasu Today Episode October 11 Highlights
Guppedantha Manasu Today Episode October 11 Highlights


ఆ మెడిసిన్ బయట నుంచి తెపించేది కాదు అంటాడు. మరి ఏంటి డాడ్ అని రిషి అంటే మానసిక ప్రశాంతత అని అంటాడు మహేంద్ర తను టీచర్ గా, భార్యగా అన్ని చోట్ల గెలిచింది. కానీ తల్లిగా మాత్రం ఓడిపోతుంది అని అంటాడు.తనని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నాను.. గెలుస్తుంది కదా రిషి అని మహేంద్ర అంటే అక్కడ నుండి రిషి వెళ్ళిపోతాడు.

Guppedantha Manasu Today Episode: దేవయానికి సరైన పర్సన్ వసునే… ఎందుకంటే..?

ఇక ధరణి వంట చేస్తుంటే వసు వెళ్లి మేడం మీ కాలు నొప్పి తగ్గిందా అంటే ఎప్పుడో తగ్గిపోయింది అంటుంది. అయినా నువ్వు అందరి గురించి ఆలోచిస్తావ్ కదా వసు అని ధరణి అంటే అందరి గురించి ఆలోచిస్తూనే కదా సంతోషం అని వసు అంటుంది. అప్పుడే దేవయాని వచ్చి ధరణిని జగతికి ఎమన్నా కావాలేమో తెలుసుకో అని అక్కడ నుండి పంపించేస్తుంది. ఇక వసు కూడా అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే నీతో మాట్లాడాలి ఉండు అని దేవయాని అంటుంది. మేడం నేను కాస్త బిజీగా ఉన్నాను. తర్వాత మాట్లాడదాము అని వసు అంటుంది. ఇక దేవయాని కోపంగా నీకు ఈ మధ్య దైర్యం బాగా పెరిగిపోయింది అంటుంది.

Guppedantha Manasu Today Episode 578 Review
Guppedantha Manasu Today Episode 578 Review


ధైర్యం ఎక్కువ అయితే సంతోషపడాలి కదా మేడం బాధపడితే ఎలా అని వసు అంటుంది. మాటలు బాగా నేర్చావ్ అని దేవయాని అంటే మాటలు బాగా మాట్లాడకతే ఈ పాడు లోకంలో బతకలేము మేడం అని అంటుంది వసు.అయినా అంత జరిగిన తరువాత మళ్ళీ ఈ ఇంటికి ఎలా వచ్చావ్.. నీకు సిగ్గు లేదా వసుదార అని అంటుంది దేవయాని. అసలు ఏమి జరిగింది మేడం.. ఇంతకన్నా రిషి సార్ తో నాకు చాలానే గొడవలు ఉన్నాయి.. అయినా మా బంధాన్ని ఎవరు విడదీయలేరు. మా మధ్యలో ఒక మంచి ఒప్పందం ఉంది అంటే ఏంటి అది అని దేవయాని అంటే అది చెప్పేది కాదులే మేడం అంటుంది వసు.ఇంతలో రిషి మెట్ల మీద నుంచి కిందకు దిగుతూ ఉండటం చూసి దేవయాని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే ఏమైంది పెద్దమ్మ అంటే నేను తర్వాత నీతో మాట్లాడతాను రిషి అంటుంది. ఇక వెళ్తూ వెళ్తూ మళ్ళీ వసు వంక చూస్తూ ఈ వసుధార రోషిని ఏదో మాయ చేసేసింది అనుకుంటుంది మనసులో.

Guppedantha Manasu Today Episode Written with HD pictures
Guppedantha Manasu Today Episode Written with HD pictures

 

వసును విడిచి వెళ్ళిపోయిన రిషి :

ఇక రిషి వసు దగ్గరకు వచ్చి నాకు కొంచెం బయట చిన్న పని ఉంది నేను వెళ్తున్నాను.నిన్ను గౌతమ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. ఇక వసదారని రిషి కారులో ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాడు. రిషి మాత్రం వసూలు నిన్ను పంపించడం ఇష్టం లేకనే ఇలా బయటికి వచ్చేసాను నిన్ను ఇంటికి తీసుకువచ్చేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది అదే నిన్ను ఇంటి నుంచి బయటకు పంపించాలంటేనే మనసుకి చాలా కష్టంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక జగతి మాత్రం రిషి గురించి వసు గురించి ఆలోచిస్తూ మహేంద్ర తో ఇలా అంటుంది.రిషి మహేంద్ర ఇద్దరూ వచ్చి నాతో ప్రేమగా మాట్లాడుతున్నట్లు ఊహించుకుంటున్నాను అని జగతి అంటే మహేంద్ర ఎందుకు అలా జగతి అని అంటే కనీసం ఊహలో అయినా అలా ఊహించుకుని సంతోషపడనివ్వు మహేంద్ర అని జగతి అంటుంది.

వసు, రిషి ప్రేమ పక్షులు :


ఇక రాత్రి అయ్యాక వాసు రెండు బొమ్మలని పట్టుకుని వాటితో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో రిషి వసూ గురించి ఆలోచిస్తూ ఈ పొగరు ఏంటి ఫోన్ చేయలేదు అంటుకుంటూ నన్ను ఏమన్నా అడగాలా అని మెసేజ్ చేస్తాడు. ఇక వసు ఆ అవును సర్ రేపు నేను జగతి మేడంని చూడడానికి మీ ఇంటికి రావచ్చా అని అంటుంది కరిచి మాత్రం నిన్ను ఆపేదెవరు వస్తువు నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు అని అంటాడు

వసును నా నుంచి దూరం చేయకండి మేడం :

ఇక మరుసటి రోజు ఉదయం జగతి గదిలోకి రిషి కాఫీ తీసుకుని వెళ్తాడు.కళ్ళు మూసుకుని ఉన్న జగతి మహేంద్ర కాఫీ తెచ్చాడేమో అనుకుని చూస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ రిషి ఉండటం తోటి నువ్వా అని లేవటానికి ప్రయత్నిస్తే పర్లేదు మేడం పడుకోండి అని చెప్పి పక్కనే ఉన్న మంచినీళ్ల బాటిల్ చేతికి ఇచ్చి తాగండి అంటాడు.మేడం మీ ఆరోగ్యం గురించి డాడ్ ని అడిగాను. మీరు ఆరోగ్యంగా ఉండాలి మేడం అని అంటాడు.మీరు ఇలా అవ్వడానికి కారణం నేనే అని మీరు అనుకోకండి. నాకు ఇష్టం లేని పని నాతో. చేయించకండి.. ఆ పిలుపు కోసం మీరు దయచేసి ఆందోళన పడకండి ఆ పిలుపు నాకు చిన్నప్పుడే దూరం అయింది.

Guppedantha Manasu Today Episode October 11
Guppedantha Manasu Today Episode October 11: Jagathi and Rishi Conversation. Image Credits: Disney+ Hotstar



Guppedantha Manasu Today Episode: అమ్మా అని పిలిస్తే కోల్పోయిన నా బాల్యాన్ని నాకు ఇస్తారా అని జగత్తిని ప్రశ్నించిన రిషి :

నేను ఇప్పుడు మిమ్మల్ని ఆ పిలుపుతో పిలుస్తాను అలాగే మీరు నాకు నా కోల్పోయిన బాల్యాన్ని తిరిగి ఇవ్వగలరా అని జగతిని ప్రశ్నిస్తాడు రిషి. అమ్మా అనే పిలుపు నాకు చిన్నప్పుడే దూరం అయింది మేడం అని రిషి అంటే జగతి మాత్రం నేనే తప్పు చేయలేదు అని చెప్పబోతుంటే ఏమి చెప్పోదు మేడం అంటాడు.ఒంటరిగా ఉన్న నా జీవితంలోకి వసుధార వచ్చాక నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది మేడం. దయచేసి మళ్ళీ ఆ బంధాన్ని కూడా నాకు దూరం చేయకండి మేడం అని అంటాడు. రిషి మాటలకు జగతి ఏడుస్తే ఉంటే నా మాటలు కొంచెం కటువుగా ఉన్నా నేను చెప్పేవి మాత్రం. నిజం అని అంటాడు రిషి. మా డాడ్ ను నన్ను వదిలేసి మీరు వెలికిపోయాక మా డాడ్ ఒంటరి జీవితం గడిపారు. ఆయన జీవితంలోకి మళ్ళీ మీరు వచ్చారు. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన సంతోషమే నాకు కావాలి అని అంటాడు రిషి. అప్పుడే గది దగ్గర నుంచుని ఉన్న మహేంద్రను చూసి ఇద్దరు కూడా షాక్ అవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Guppedantha Manasu Previous Episode October 10: కళ్ళు తిరిగి పడిపోయి జగతి ఉంటే… వసు, రిషిలు పెళ్లి చేసుకుని రావడం ఏంటి..?

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu