Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఏడో వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. కెప్టెన్ సూర్య ఇంకా గీతు రాయల్ మినహా మిగతా ఇంటి సభ్యులు నామినేషన్ లో ఉన్నారు. ఏడో వారం నామినేషన్ లో ఉన్న సభ్యులు… రాజ్, శ్రీ సత్య, ఇనాయా, రేవంత్, కీర్తి, శ్రీహాన్, మెరీనా, రేవంత్, ఆదిరెడ్డి, బాలాదిత్య, అర్జున్, వాసంతి, ఫైమా. మొత్తం 13 మంది సభ్యులు ఏడో వారం నామినేషన్ లో ఉన్నారు. అత్యధికమైన ఓట్లు రేవంత్ ఇంకా బాలాదిత్యకి వచ్చాయి. నామినేషన్ ప్రక్రియలో ఎప్పటిలాగానే ఇనాయా … శ్రీహాన్ మధ్య గొడవ జరిగింది.
ఇంకా ఆదిరెడ్డికి అర్జున్ తో పాటు వాసంతితో గొడవలు అయ్యాయి. రాజ్ ఇంకా వాసంతి మధ్య కూడా గొడవ జరిగింది. గతవారం కెప్టెన్ గా ఉన్న రేవంత్ రెండుసార్లు పడుకున్నా విషయాన్ని చాలామంది ఇంటి సభ్యులు ప్రస్తావించి… అతన్ని నామినేట్ చేశారు. ఇంకా కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బాల్ అందించే విషయంలో బాలాదిత్య… రోహిత్ కి సపోర్ట్ చేయడంతో చాలామంది అతన్ని నామినేట్ చేశారు. ఇక బ్యాటరీ గేమ్ లో బిగ్ బాస్ ఆదేశాలు మేరకు రోహిత్ నేరుగా రెండు వారాలు నామినేట్ కావడంతో అతని ఎవరు నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
మొత్తం మీద హౌస్ లో ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అత్యధికంగా సభ్యులు ఏడో వారం నామినేషన్ లో ఉండటం జరిగింది. దీంతో ఈ వారం ఓటింగ్ గట్టిగా జరగనున్నట్లు తెలుస్తోంది. మరి ఏడో వారంలో ఎవరు హౌస్ నుండి వెళ్ళిపోతారో చూడాలి.