Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఏడు వారాల ఆట ముగిసే సరికి 21 మంది సభ్యులకు 14 మంది మిగిలారు. ఇప్పటివరకు ఏడుగురు సభ్యులు ఇంటి నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. ఆదివారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడు. 13 మంది నామినేషన్ లో ఉండగా గురువారం వరకు ఓటింగ్ పోల్ లో టాప్ లో ఉన్న అర్జున్.. ఎలిమినేట్ కావటం అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లయింది. ఇదిలా ఉంటే హౌస్ లో కంటెస్టెంట్ శ్రీ సత్య ఎప్పుడు కూడా ఏడ్చిన సందర్భాలు లేవు.
మర పక్క హౌస్ లో ఉన్నంతసేపు శ్రీ సత్య వెంట పడుతూనే ఉండేవాడు అర్జున్. ఆమె గెలవాలని అర్జున్ చాలా సార్లు టాస్క్ ఆడే టైములో త్యాగాలు కూడా చేశారు. ఇంకా నామినేషన్ లో కూడా నేరుగా నామినేట్ అయినా సందర్భాలు ఉన్నాయి. కానీ శ్రీ సత్య… ఎప్పుడూ కూడా అర్జున్ నీ పెద్దగా పట్టించుకున్న సందర్భాలు లేవు. అయితే ఆదివారం అర్జున్ ఎలిమినేట్ కావడంతో శ్రీ సత్య కంటనీరు పెట్టుకుంది. వేదికపై నాగార్జున పక్కన అర్జున్ సభ్యులకు గురించి మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఇద్దరు ఒకేసారి ఏడ్చేశారు.
ఆ తర్వాత తేరుకొని శ్రీ సత్య చాలా స్ట్రాంగ్ కంటెంస్టెంట్ అని అర్జున్ కొనియాడారు. శ్రీ సత్య బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యాక నాకు ఫోన్ చేసింది సార్ అంటూ నాగార్జునకి అర్జున్ తెలియజేశారు. ఆమె కోసమే బిగ్ బాస్ కి వచ్చినట్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఏడు వారాలు బాగా ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు. ఇంకా చివరిలో లోపల గేమ్ నువ్వు రెచ్చిపో బయట నేను చూసుకుంటా.. అంటూ శ్రీ సత్య కి అర్జున్ భరోసా ఇవ్వడం హైలైట్.