NewsOrbit
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత హాజరీపై హైకోర్టులో విచారణ..సుప్రీం కోర్టు ఉత్తర్వులు చూశాకే విచారణ అన్న హైకోర్టు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై తెలంగా హైకోర్టు లో బుధవారం విచారణ చేపట్టింది. బీఎల్ సంతోష్ కు ఈ నెల 16 నుండి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించామని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. చివరకు ఢిల్లీ పోలీసుల సాయంతో బీజేపీ ఆపీసులో నోటీసులు అందించినట్లు వివరించారు. బీఎల్ సంతోష్ సిట్ ముందుకు వస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయని ఏజి కోర్టుకు తెలిపారు. సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతోందని వివరించారు. విచారణకు హజరుకాని తుషార్, జగ్గుస్వామిలకు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలిపారు. విచారణకు సంతోష్ రాకపోతే సాక్ష్యాలు తారుమారు అవ్వొచ్చని ఏజీ అనుమానం వ్యక్తం చేశారు. సిట్ ముందు బీఎల్ సంతోష్ హజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఏజీ న్యాయస్థానాన్ని కోరారు.

Telangana High Court

 

మరో వైపు బీఎల్ సంతోష్ చట్టాన్ని ఎక్కడా దిక్కరించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది రామచంద్రరావు ధర్మాసనానికి తెలిపారు. సంతోష్ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని న్యాయవాది రామచంద్రరావు తెలియజేయగా, రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదని సిట్ తరఫున ఏజి వాదనలు వినిపించారు. సిట్ విచారణకు సంతోష్ భయపడటం లేదని న్యాయవాది రామచంద్రరావు తెలిపారు. ఈ క్రమంలో బీఎల్ సంతోష్ 41 సీఆర్పీసీ నోటీసులను సవాల్ చేయాలనుకుంటున్నారా.. ?  సిట్ ముందు హజరుకావడానికి సంతోష్ గడువు కోరుతున్నారా..? అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ తరపు న్యాయవాది బదులు ఇస్తూ.. బీఎల్ సంతోష్ సిట్ కు లేఖ రాశారని తెలిపారు. విచారణకు ఎందుకు హజరు కాలేకపోతున్నారో లేఖలో పేర్కొన్నారని వివరించారు.

BL Santhosh

 

దీనిపై సిట్ తరపు ఏజి ..బీఎల్ సంతోష్ తనకు ఇష్టమొచ్చినప్పుడు విచారణకు వస్తే కేసు తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సుప్రీం కోర్టు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని అడిగింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇంకా అప్ లోడ్ కాలేదని ఏజీ సమాధానం ఇచ్చారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు చూసిన తర్వాతనే విచారణ జరుపుతామని హైకోర్టు వెల్లడించి.. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. అయితే సాయంత్రానికి సుప్రీం కోర్టు ఉత్తర్వులు రావచ్చని న్యాయవాదులు భావిస్తున్నారు.

Breaking: మంత్రి మల్లారెడ్డి కుమారుడికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju