Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ దాదాపు ఫైనల్ కి చేరుకుంది. హౌస్ లో మొత్తం యెనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అన్నది ఆసక్తికరంగా ఉంది. ఈ సీజన్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. సీజన్ స్టార్టింగ్ లో కొంతమందిని కచ్చితంగా వాళ్ళు టాప్ ఫైవ్ లో ఉంటారని.. ఆడియన్స్ అంచనాలు వేశారు. కానీ అనుకున్న వాళ్లంతా చాలా పూజా మంది ఎలిమినేట్ అయిపోయారు.
సూర్య, గీతూ, బాలాదిత్య…వంటి కంటేస్టంట్స్ కచ్చితంగా గేమ్ లో చివరి వరకు ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ గేమ్ మధ్యలోకి వచ్చేసరికి వీళ్ళంతా ఎలిమినేట్ కావటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ క్రమంలో సీజన్ స్టార్టింగ్ లో చాలా వీక్ కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్లు చివరి వరకు వచ్చారు. వాసంతి, రాజ్, మెరీనా ఈ ముగ్గురు హౌస్ లో ప్రారంభంలో చాలా స్లోగా గేమ్ ఆడారు. కానీ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. మాటతీరు మార్చుకుని.. హౌస్ లో రాణించారు. ఇదంతా పక్కన పెడితే.. సోమవారం ఎపిసోడ్ లో 13వ వారం నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది.
ఉన్న ఎనిమిది మంది నువ్వా నేనా అన్నట్టుగా పాయింట్లు మాట్లాడుతూ… నామినేషన్ చేశారు. 13వ వారం నామినేషన్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు. కెప్టెన్ ఇనాయా, శ్రీ హాన్ మినహా..మిగతా కంటెస్టెంట్స్. ఈ వారం నామినేషన్ లో ఉన్న లిస్టు..రోహిత్, రేవంత్, ఫైమా, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీ సత్య. మరి ఆరుగురిలో ఎవరు ఈ వారం లేట్ అవుతారో చూడాలి.