NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ఈ విషయంలోనూ దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..!

YS Jagan:  విధి నిర్వహణలో తన అభిమానాన్ని చొరగొంటే ఉన్నతాధికారులు పదవీ విరమణ అయినా వారికి కీలక పోస్టులు కట్టబెడుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆగ్రహం తెప్పిస్తే మాత్రం ఆ అధికారిని అవమాకరంగా పంపించి వేస్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన నలుగురిలో ఒక్కరికి మినహా మిగిలిన అధికారులు పదవీ విరమణ తర్వాత కీలక పోస్టుల్లో కూర్చొబెట్టారు సీఎం జగన్. అభిమానిస్తే అందలం ఎక్కిస్తారు, ఆగ్రహం కల్గిస్తే శంకరగిరి మాన్యాలకు పంపిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

AP CM YS Jagan

 

జగన్ సర్కార్ లో మొదటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా బాధ్యతలు నిర్వహించిన ఎల్వీ సుబ్రమణ్యం విషయంలో తేడా రావడంతో ఆయన పదవీ విరమణకు ఆరు నెలల ముందే ఆ పోస్టు నుండి తొలగించి ఏపి మానవ వనరుల శాఖ డీజీగా నియమించారు. ఓ ఉన్నత హోదాలో పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యం అవమానకరంగా పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ తర్వాత జగన్ సర్కార్ లో సీఎస్ లుగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ అధికారులు మాత్రం ఆయన అభిమానాన్ని చొరగొన్నారు. సీఎస్ గా ఆరు నెలలు చొప్పున ఒకటి రెండు సార్లు ఎక్స్ టెన్షన్ లభించింది. పదవీ విరమణ తర్వాత కీలక పోస్టులు లభించాయి.

LV Subramanyam

ఎల్వీ సుబ్రమణ్యం తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని పదవీ విరమణ అయిన వెంటనే సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ గా కేబినెట్ ర్యాంక్ లో నియమితులైయ్యారు. తర్వాత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ కాగానే ఆ పోస్టులో నియమితులైయ్యారు నీలం సాహ్ని. ఆ తర్వాత సీఎస్ గా బాధ్యతలు నిర్వహించిన ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ కాగానే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ సలహదారుగా న్యూఢిల్లీలో ఏపి భవన్ కు నియమితులైయ్యారు. తాజాగా నేడు రిటైర్ అవుతున్న సమీర్ శర్మ కోసం ప్రత్యేకంగా సీఎంఓలో ఓ కీలక పోస్టును క్రియేట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫీసియో చీఫ్ సెక్రటరీ హోదాలో సమీర్ శర్మ .. సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా రేపు సీఎంఓలో బాధ్యతలు చేపట్టనున్నారు.

Neelam Sahni, Adityanath , Sameer Sharma

 

సమీర్ శర్మతో పాటు మరో సీనియర్ ఐఏఎస్ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పోస్టును సృష్టించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ విజయకుమార్ నేడు పదవీ విరమణ అవుతున్నారు. జిల్లాల విభజన ను ఆయన సమర్దవంతంగా పూర్తి చేశారు. ఆయనను స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటి సీఈఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ప్రణాళికా విభాగం ఎక్స్ అఫిషియో సెక్రటరీ హోదాలో విజయకుమార్ రేపటి నుండి బాధ్యతలు నిర్వహించనున్నారు. జగన్ హయాంలో అయిదవ సీఎస్ గా జవహర్ రెడ్డి నియమితులైయ్యారు.

TRS Vs BJP: బాబును చూసి నేర్చుకోలేదా..!? కేసిఆర్ దగ్గర కౌంటర్ ప్లాన్ లేదా..!?

Jawahar Reddy

Related posts

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N