Waltair Veerayya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ రవితేజ కలిసి నటిస్తున్న సినిమా “వాల్తేరు వీరయ్య”. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తారీకు విడుదల కానుంది. కొద్ది నెలల క్రితమే చిరంజీవి ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ కాగా.. ఫుల్ మాస్ తరహాలో కనిపించారు. కాగా డిసెంబర్ 12వ తారీకు మాస్ మహారాజ రవితేజ..ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేశారు. వీడియోలో రవితేజ చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపించడం జరిగింది. పోలీస్ ఆఫీసర్ ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో కనిపిస్తున్నారు. రవితేజ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రధాన పాత్రలో చిరంజీవి కనిపించినా గానీ సినిమాలో 40 నిమిషాల పాటు రవితేజ క్యారెక్టర్ ఉన్నట్లు సమాచారం. కాగా అంతకుముందు విడుదల చేసిన టైటిల్ టీజర్ తో పాటు “బాస్ పార్టీ” సాంగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. బాబీ చాలా ఉర మాస్ లుక్ లో చిరుని చూపిస్తున్నారు. అప్పట్లో ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు టైములో ఉన్న రీతిలో ఈ సినిమాలో కనిపిస్తున్నారు. గతంలో “గాడ్ ఫాదర్” సినిమా రిలీజ్ సమయంలో ప్రమోషన్ కార్యక్రమంలో వాల్తేరు వీరయ్య కామెడీగా మాస్ తరహాలో అదరగొడుతుందని చిరంజీవి తెలియజేయడం జరిగింది. దీంతో “వాల్తేరు వీరయ్య” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నం వేదికగా జరిగే రీతిలో ప్లాన్ చేయడం జరిగింది. జనవరి 8వ తారీకు వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి సినిమా యూనిట్ ఏర్పాట్లు చేస్తుంది. సంక్రాంతి రేస్ లో భాగంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకి ఒక రోజు ముందు బాలకృష్ణ “వీరసింహారెడ్డి” రిలీజ్ అవుతుంది. చాలా కాలం తర్వాత చిరు… బాలయ్య సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరిది పై చేయి అవుద్ది అన్నది ఆసక్తికరంగా ఉంది.