NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ambati Rambabu Vs Ayyanna patrudu: పవన్ నివాసానికి చంద్రబాబు .. అంబటి వర్సెస్ అయ్యన్న వంగ్యాస్త్రాలు

Ambati Rambabu Vs Ayyanna patrudu:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి మాదాపూర్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, పొత్తు పటిష్టత, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిపెస్టో తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తొంది.

అయితే పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లి భేటీ కావడంపై వైసీపీ నేత, ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఎవరి ఇంటికి ఎవరు వెళ్లిన చివరకు అక్కడే స్థిరపడతారు అంటూ కామెంట్స్ చేశారు. అలానే నాదెండ్ల సంతృప్తి చెందేలా చర్చలు జరిగాయి, అర్ధమయ్యిందా.. నాదెండ్ల విముక్త జనసేన కోసం పారాడేవాడే అసలైన సైనికుడు అని ట్వీట్ చేశారు.

చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో నాదెండ్లను టార్గెట్ చేస్తూ అంబటి రాంబాబు విమర్శలు చేశారు. అయితే దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సైతం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అంబటి పై సెటైర్ వేశారు. సీట్ పోయింది.. ట్వీట్ మిగిలింది.. అయ్యోయ్యే అంబటీ.. అంటూ సెటైర్ వేశారు. రాబోయే ఎన్నికల్లో అంబటి స్థానంలో మరో నేతకు సత్తెనపల్లి నుండి వైసీపీ దింపే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంబటికి సీటు పోయింది అన్నట్లుగా అయ్యన్న కామెంట్స్ చేశారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తుతో పోటీ చేయనున్న నేపథ్యంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా ఇన్ చార్జిల మార్పులు చేర్పులు చేస్తొంది. ఈ క్రమంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం, పక్కన పెట్టడం లాంటి కీలక నిర్ణయాలను తీసుకుంటోంది వైసీపీ. ఈ నేపథ్యంలో ఎవరిని పక్కన పెడతారో అన్న ఆందోళన పలువురు వైసీపీ ఎమ్మెల్యేల్లో నెలకొంది.

Joe Biden: అమెరికాలో కలకలం .. అధ్యక్షుడు బైడెన్ సెక్యురిటీ వాహనాన్ని ఢీకొట్టిన కారు

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?