(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
యాంకర్ రవి కారుకు ప్రమాదం జరిగింది. మూసాపేట్ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తున్న సమయంలో రవి కారును ఓ డిసిఎం వ్యాన్ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో రవికి ఏం కాలేదు. అయితే, రవి కార్ మాత్రం డ్యామేజ్ అయింది. రాంగ్ రూట్లో వచ్చి.. తన కార్‌ను డిసిఎం డ్రైవర్ ఢీకొట్టాడని రవి తెలిపాడు. ఆ సమయంలో డిసిఎం వ్యాన్ డ్రైవర్, క్లినర్ తాగి ఉన్నారని చెప్పాడు. ఇద్దరు డిసిఎంను అక్కడే వదిలేసి పారిపోయారని తెలిపాడు. ఇంత దారుణంగా తాగి డ్రైవ్ చేయడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రవి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. ఈ మేరకు యాంకర్ రవి ఓ వీడియోలో వెల్లడించాడు.