NewsOrbit
రాజ‌కీయాలు

అసెంబ్లీ తీరుపై సిపిఎం నేత రాఘవులు ఏమన్నారంటే..!?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అధికార, ప్రతిపక్ష నేతల తిట్ల పురాణానికి కేంద్రంగా మారిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. సిఐటియూ రాష్ట్ర సభలకు హజరైన బివి రాఘవులు మీడియా సమావేశంలో ఏపి అసెంబ్లీ జరుగుతున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభను చూస్తే అది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సభలా కనిపించడం లేదనీ, వ్యక్తుల తిట్ల పురాణ సభగా మారిపోయిందనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం దురుదృష్టకరమని రాఘవులు అన్నారు.

టిడిపి తన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రతిబంబించేలా వ్యవహరించాల్సిన టిడిపి ఆ విషయంలో చాలా వెనుకబడిందని అన్నారు. దీనిని పాలకపక్షం అనుకూలంగా మార్చుకుందని ఆయన పేర్కొన్నారు.  అధికార పార్టీ చేసే తప్పుడు విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, అప్రజాస్వామిక పనులను సులభంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని రాఘవులు అన్నారు. నాడు టిడిపి, నేడు వైసిపి రాష్ట్రంలో పాలనను గాలికి వదిలివేసినట్లుగా ఉందని పేర్కొన్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరువాత వేగంగా అభివృద్ధి చెందుతుందని భావించామనీ కానీ గతం కన్నా వెనుకబడిపోయిందనీ రాఘవులు వ్యాఖ్యానించారు.

వైసిపి, టిడిపిలు రాష్ట్రంలో ఒకలా, కేంద్రంలో మరోలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కేంద్రంలో బిజెపితో జతకట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని రాఘవులు అన్నారు.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?

జ‌గ‌న్ కోసం… జ‌గ‌న్ వెంటే… ఆ ఓట‌రే వైసీపీకీ ప్ల‌స్ అయ్యాడా…!

ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్ పొలిటిక‌ల్ కెరీరే డేంజ‌ర్లో ప‌డిందా..?

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

sharma somaraju

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Leave a Comment