NewsOrbit
రాజ‌కీయాలు

‘జగన్ కు రోజులు దగ్గర పడ్డాయి’

అమరావతి: ఏపీ రాజధాని మార్పుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. మంగళవారం విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షలో చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులందరూ త్యాగాలు చేసి అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చారని గుర్తు చేశారు. అంతేగానీ, రియల్ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రైతులు భూములు ఇవ్వలేదన్నారు. రాజధానిపై ఏర్పాటు చేసిన కమిటీలన్నీ జగన్‌ రాసిచ్చిన స్క్రిప్టులే చదువుతున్నాయని విమర్శించారు. అమరావతి నిర్మాణం చేసి తీరాలని, రాజధానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజావేదికను కూల్చడంతోనే అమరావతిపై జగన్‌కు ఉన్న కోపాన్ని తెలిపిందని పేర్కొన్నారు.

‘ఒక అమ్మ, అబ్బకి పుట్టినవాడు ఎవడైనా అమరావతి రాజధాని మార్పును కోరుకోడు’ అని చింతమనేని ఘాటుగా వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని తరలింపు 29 గ్రామాల సమస్య కాదు.. రాష్ట్ర సమస్య అని తెలిపారు. అమరావతి నుంచి రాజధానిని మార్చడం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడమేనని చెప్పారు. జగన్ ఇంటి పేరు రివర్స్ అని పెట్టుకుంటే బాగుంటుందన్నారు. జగన్ ఉన్మాది, అహంకారి, దుర్మార్గుడు అనే భావన ప్రజలలో నెలకొందన్నారు. రానున్న రోజుల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చింతమేని హెచ్చరించారు.

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Leave a Comment