NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Badvel By Poll: బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ – జనసేన పోటీపై సోము వీర్రాజు ఇచ్చిన క్లారిటీ ఇదీ..!!

Badvel By Poll: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30వ తేదీన బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుండగా, నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. అక్టోబర్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలైన వైసీపీ, టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ ఇంతకు ముందే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్ ను అభ్యర్థిగా ప్రకటించింది. నిన్న వైసీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి సుధను వైసీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.

ap bjp chief somu veerraju comments on Badvel By Poll
ap bjp chief somu veerraju comments on Badvel By Poll

Badvel By Poll: జనసేనతో చర్చించే నిర్ణయం

అయితే ఇక్కడి ఎన్నికల్లో బీజేపీ – జనసేన అభ్యర్థిని నిలుపుతుందా లేదా అన్న ఊహగానాలు సాగుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు క్లారిటీ ఇచ్చారు. తమ మిత్రపక్షమైన జనసేనతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు సోము వీర్రాజు. బద్వేల్ లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయాలా లేక జనసేన అభ్యర్థి పోటీ చేయడమా అనేది త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ రోజు జనసేన నిర్వహించే సమావేశంలో బద్వేల్ ఉప ఎన్నికల అంశంపై వారు చర్చిస్తారని సోము వీర్రాజు అన్నారు. అయితే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘోర ఓటమి చవి చూసిన బీజేపీ ఈ సారి బద్వేల్ లో పోటీకి సిద్దంగా లేదన్నట్లు తెలుస్తోంది. అందుకే జనసేనకు వదిలివేయాలని భావిస్తోంది. గత ఎన్నికల్లోనూ బద్వేల్ లో బీజేపీ, జనసేన పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలపలేదు.

ఈ కారణంతో జనసేన, బీజేపీ పోటీ చేయకపోవచ్చు

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గుంతోటి వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల ఆధిక్యతతో ఓబులాపురం రాజశేఖర్ పై విజయం సాధించారు. వెంకట సుబ్బయ్యకు 95,482 ఓట్లు రాగా రాజశేఖర్ కు 50,748 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి నీరుగట్టు దొర విజయ జ్యోతికి 2,883 ఓట్లు, నోటాకు 2,004 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. గడచిన ఎన్నికల్లో బీజేపీ, జనసేన అభ్యర్థులు పోటీ చేయనందున ఈ ఉప ఎన్నికలోనూ పోటీ చేయకపోవచ్చని అంటున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో ఆయా పార్టీల నుండి పోటీ చేయడానికి పెద్దగా ఆశించే నాయకులు లేకపోవడంతో అంతగా దృష్టి సారించడం లేదని సమాచారం. జనసేన నిర్ణయం కూడా దీనిపై ఒకటి రెండు రోజుల్లో వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

Read more: Harirama Jogaiah: ఏపి సీఎం జగన్ పై సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!